ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా!

ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రత వైఫల్యాలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ భారీ స్థాయిలో జరిమానా విధించింది. దర్యాప్తు సెటిల్‌మెంట్‌లో భాగంగా ఫేస్‌బుక్‌ 5 బిలియన్‌ డాలర్లు(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 34వేల కోట్లు) చెల్లించేందుకు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ 32 ఓట్లతో అంగీకరించింది. ఈ మేరకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. అయితే ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించడం ఇప్పుడే. […]

ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా!
Facebook
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 13, 2019 | 6:22 PM

ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రత వైఫల్యాలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ భారీ స్థాయిలో జరిమానా విధించింది. దర్యాప్తు సెటిల్‌మెంట్‌లో భాగంగా ఫేస్‌బుక్‌ 5 బిలియన్‌ డాలర్లు(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 34వేల కోట్లు) చెల్లించేందుకు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ 32 ఓట్లతో అంగీకరించింది. ఈ మేరకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. అయితే ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించడం ఇప్పుడే. కాగా ఈ సెటిల్‌మెంట్‌ను అమెరికా న్యాయశాఖ అంగీకరించాల్సి ఉంది.

ఫేస్‌బుక్‌పై గతంలోనూ భద్రతా వైఫల్యాల ఆరోపణలు వచ్చాయి. దీంతో 2011లో ఈ కంపెనీ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌తో సెటిల్‌మెంట్‌ చేసుకుంది. అయితే ఇటీవల కేంబ్రిడ్జ్‌ అనలిటికా వివాదంతో ఈ సోషల్‌మీడియా సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ గతేడాది ఫేస్‌బుక్‌పై ఉన్న కేసును మళ్లీ తెరిచింది. ఈ కేసు సెటిల్‌మెంట్‌లో భాగంగానే భారీ జరిమానా విధించింది. జరిమానాతో పాటు కొన్ని ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది.