అమెరికాను భయపెడుతోన్న ‘బ్యారీ’ తుఫాన్.. హై అలర్ట్

అమెరికా తీరం వైపు బ్యారీ తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 80కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన తుఫాన్ హరికేన్‌గా బలపడనున్నదని అమెరికా నేషనల్ హరికేష్ సెంటర్ అంచనా వేస్తోంది. లూసియానా దిశగా ఈ తుఫాన్ పయనిస్తోంది. దీని ప్రభావం వల్ల 25సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లూసియా, వర్జీనియా, మేరిలాండ్, నార్త్ వెస్ట్రర్న్ డీసీ, సదరన్ మౌంట్ గొమెరి కౌంటీ, అర్లింగ్‌టన్‌కౌంటీ, ఫాల్స్‌చర్చ్ ప్రాంతాలు జలదిగ్భంధంలో […]

అమెరికాను భయపెడుతోన్న ‘బ్యారీ’ తుఫాన్.. హై అలర్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 13, 2019 | 1:38 PM

అమెరికా తీరం వైపు బ్యారీ తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 80కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన తుఫాన్ హరికేన్‌గా బలపడనున్నదని అమెరికా నేషనల్ హరికేష్ సెంటర్ అంచనా వేస్తోంది. లూసియానా దిశగా ఈ తుఫాన్ పయనిస్తోంది. దీని ప్రభావం వల్ల 25సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లూసియా, వర్జీనియా, మేరిలాండ్, నార్త్ వెస్ట్రర్న్ డీసీ, సదరన్ మౌంట్ గొమెరి కౌంటీ, అర్లింగ్‌టన్‌కౌంటీ, ఫాల్స్‌చర్చ్ ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. మిసిసిపీ నది పొంగి ప్రవహిస్తోంది. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. కాగా ప్రస్తుత పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్ష నిర్వహించారు. లూసియానా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రానికి కూడా తుఫాను ముంపు పొంచి ఉండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.