అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి ‘కీచురాళ్ళ’ బెడద ! బ్రిటన్ పర్యటనకు వెళ్లే ముందు… విమాన ప్రయాణంలో జాప్యం !
అమెరికాలో కీచురాళ్ళ ఈ దేశానికి పెను సమస్యగా మారుతున్నాయి. ఈ పెద్ద సైజు కీటకాలు బొరియల లోనుంచి ప్రతి 17 ఏళ్ళకొకసారి బయటపడుతుంటాయట.. అధ్యక్షుడు జోబైడెన్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ వెళ్లేందుకు వైట్ హౌస్ స్టాఫ్ తోను,..
అమెరికాలో కీచురాళ్ళ ఈ దేశానికి పెను సమస్యగా మారుతున్నాయి. ఈ పెద్ద సైజు కీటకాలు బొరియల లోనుంచి ప్రతి 17 ఏళ్ళకొకసారి బయటపడుతుంటాయట.. అధ్యక్షుడు జోబైడెన్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ వెళ్లేందుకు వైట్ హౌస్ స్టాఫ్ తోను, జర్నలిస్టుల బృందం తోను చార్టర్డ్ విమానంలో బయలుదేరబోతుండగా ఈ కీటకాలు వీరికి పెద్ద ప్రాబ్లమ్ గా పరిణమించాయి. జాయింట్ బేస్ ఏంద్రూస్ వద్దకు బైడెన్ చేరుకోగా ఆయన మెడ వెనుక ఓ కీచురాయి చేరడంతో ఆయన వెంటనే దాన్ని విసురుగా కిందకు పారేశారు.వాచ్ ఫర్ ది సికాడాస్.. ఐ జస్ట్ గాట్ వన్ ఇట్.. గాట్ మీ’ అని జర్నలిస్టులతో అన్నారు. (సికాడాస్ అంటే కీచురాయని అంటారు).. పెద్దగా రొద చేసే ఇవి ఎక్కడపడితే అక్కడ చెట్లపైన, భవనాల పైనా చేరుతుంటాయి. వీటి కారణంగా బైడెన్ వెళ్లాల్సిన విమానం ఏడు గంటలు ఆలస్యం కావడంతో ఆయన ఇతరులతో కలిసి మరో విమానంలో బయల్దేరి వెళ్లారు. అసలు మొదట ప్లేన్ లోకి ఈ కీచురాళ్ళ ఎలా చేరాయో తెలియలేదు.
కాగా బైడెన్ విజిట్ కి సంబంధించిన న్యూస్ కవరేజీకి మాత్రం ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఈ కీచురాళ్ళ సాధారణంగా రాత్రుళ్ళు బొరియలలో నుంచి బయటికి వస్తాయని, ఎలాంటి కీటక నాశన మందులకు లొంగవని అంటారు..
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది..అన్నం తినలేదు కొట్టాను అంటూ తల్లి కేర్ లెస్ ఆన్సర్ :Viral video.