Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mask Mandate: ఇండోర్ మాస్క్ తప్పనిసరి.. కాలిఫోర్నియా ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం..

వేరియంట్ ఆవిర్భావం కారణంగా కోవిడ్ -19 కేసుల అంచనా పెరుగుదలకు సిద్ధం కావడానికి కాలిఫోర్నియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ఇండోర్ మాస్క్ తప్పనిసరని..

Mask Mandate: ఇండోర్ మాస్క్ తప్పనిసరి.. కాలిఫోర్నియా ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం..
California
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 14, 2021 | 10:01 PM

ఒమిక్రాన్‌ టెన్షన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా అమెరికాలోని చాలా రాష్ట్రాలు కోవిడ్‌ నిబంధనలను పొడిగించాయి. కరోనా వైరస్‌ కొత్త కొత్త రూపాలతో ప్రజలపై దాడి చేసుకుంటడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. మొన్నటి వరకు కోవిడ్ డెల్టా వేరియంట్‌తోనే భయాందోళనకు గురైన జనం.. ఇప్పడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో మరోసారి భయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పటికే పలు దేశాలకు పాకుతోంది. దీంతో ఆయా దేశాల్లో ఒమిక్రాన్‌ తీవ్రతను బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదిలావుంటే.. తాజాగా కాలిఫోర్నియాలో మరోసారి కరోనా నిబంధనలను తీవ్రం చేస్తున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.

ఇయర్ ఎండింగ్ సెలవుల్లో సమావేశాలు, కొత్త ఓమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావం కారణంగా కోవిడ్ -19 కేసుల అంచనా పెరుగుదలకు సిద్ధం కావడానికి కాలిఫోర్నియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ఇండోర్ మాస్క్ తప్పనిసరని తాజా ఆదేశాలను జారీ చేసింది.

మాస్క్‌ తప్పనిసరి నిబందనలు కనీసం ఒక నెల పాటు కొనసాగుతుందని పేర్కొంది. ఆ సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అవసరమైతే మరిన్ని సిఫార్సులు చేస్తుందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల సగటు కేసు రేటు దాదాపు సగం పెరిగిందని, ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 14 శాతం పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ సమయంలో ఫంక్షన్‌లు, స్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహిస్తే హజరయ్యేవారు తప్పకుండా కోవిడ్‌ టీకా తీసుకొని ఉండాలని సూచించారు. లేకుండా 72 గంటల ముందు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ అయినా ఉండాలని సూచించింది.

ఇవి కూడా చదవండి: Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ

భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామిజీ పిలుపు