Chestnut Ridge Falls: జలపాతం వెనుక నిత్యం వెలుగుతున్న దీపం.. మిస్టరీ అంటున్న జనం.. గ్యాస్ అంటున్న సైన్స్.. ఎక్కడంటే..
Chestnut Ridge Falls: ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు...మానవ మేథస్సు కు సైతం అందని రహస్యాలు.. తన తెలివి తేటలకు పదును పెట్టి.. అంతరిక్షంలోని అడుగు పెట్టి.. అక్కడ ఏముందో..
Chestnut Ridge Falls: ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు…మానవ మేథస్సు కు సైతం అందని రహస్యాలు.. తన తెలివి తేటలకు పదును పెట్టి.. అంతరిక్షంలోని అడుగు పెట్టి.. అక్కడ ఏముందో తెలుసుకోగలుగుతున్నారు. అయితే భూమి మీద ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు సవాల్ విసురుతున్న మిస్టరీలు ఎన్నో దాగున్నాయి. కొన్నింటిని తెలుసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సక్సెస్ అందుకోలేక ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రకృతిలోని ఓ జలపాతం వింత జలపాతం.. దానికి వెనుక నిత్యం వెలిగే దీపం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్‌లో చెస్ట్ నట్ రిడ్జ్ అనే పార్క్ ఉంది. అక్కడ షేల్ క్రీక్ ప్రిజెర్వ్ అనే ఓ ప్రదేశంలో ఈ జలపాతం జాలువారుతూ ఉంది. దీన్ని ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అంటారు. ఎందుకంటే దీని వెనక ఓ దీపం ఉంది అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది తప్ప ఆరడంలేదు… అలాగని పెద్ద మంట కూడా రావట్లేదు. చిన్న దీపం లాగా వెలుగుతూనే ఉంది. ఇది కనుక భారత దేశంలో కనుక ఉంటే ఈపాటికి అక్కడ గుడి కట్టేసేవాళ్లు.. ప్రకృతి పట్ల మనకున్న భక్తి, గౌరవం అలాంటివి మరి. ఇక ఆ దీపం ఎలా వెలుగుతోంది అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు తెలిశాయి. ఇది చిన్న జలపాతమే… దీని వెనక ఒక బండరాయి ఉంది. ఆ రాయి కింద భూభాగానికి ఓ చిన్న కన్నం ఉంది. ఆ కన్నం నుంచి కంటిన్యూగా గ్యాస్ బయటకు వస్తోంది. ఎలా అంటే మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు వచ్చే మంటలాగా వస్తుంది. ఆ సహజ వాయువు వల్లే ఆ దీపం వెలుగుతోందని పరిశోధకులు తేల్చారు. సంవత్సరమంతా ఇది కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వం పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ దీపం ఎప్పుడూ ఒకే సైజులో ఉంటుంది. భూమిలో సహజవాయువు ఎప్పుడూ ఒకే పరిమాణంలో రాదు..కానీ ఇక్కడ మాత్రం ఒకే పరిమాణంలో వస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే… ఆ దివ్వె ఎప్పుడూ అదే సైజులో ఉంటోంది.
ఆ దీపం ఎందుకు వెలుగుతుందో తేలినా… కచ్చితమైన సమాధానం రాబట్టాలనే ఉద్దేశంతో పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. సాధారణంగా ఇలాంటి వాటిలో ఎక్కువగా మీథేన్ వాయువు బయటకు వస్తుంది. ఇక్కడ మాత్రం దీపం లోపల భూమిలో… ఈథేన్, ప్రోపేన్ వాయువులు ఎక్కువగా బయటకు వస్తున్నాయని తెలిపారు. ఇవి భూమి లోపల 1,300 అడుగుల కింది నుంచి వస్తున్నాయని కనిపెట్టారు. ఏది ఏమైనా ఈ దివ్వె మాత్రం ప్రపంచంలోనే ప్రత్యేక దీపంగా మారింది. జలపాతాన్ని తన ముందు ఉంచుకొని… ప్రపంచ పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.
Also Read: భగవద్గీత అఖండ పారాయణం.. పులకించిన సప్తగిరులు.. వర్షాన్ని సైతం లెక్క చేయని భక్తులు