Tanzanians viral Video: సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపించారు.. టాంజానియా అన్నాచెల్లెళ్ల సూపర్ సాంగ్.!(వీడియో)
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, ముద్దుగుమ్మ కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం షేర్షా. కార్గిల్ పోరాట యోధుడు విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా విష్ణు వర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, ముద్దుగుమ్మ కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం షేర్షా. కార్గిల్ పోరాట యోధుడు విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా విష్ణు వర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 12న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని రాతన్ లంబియాన్ అనే సాంగ్ సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ పాటకు ఎంతో క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఈ సాంగ్‌కు టాంజానియాకు చెందిన టిక్‌టాక్ సెన్సేషన్ కిలీపాల్, అతని సోదరి నీమాలు రీక్రియేట్ చేశారు. పాటలోని లిరిక్స్‌కు తగ్గట్టుగా అద్భుతంగా లిప్ సింక్ చేస్తూ, ఎక్స్‌ప్రెషన్లతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. షేర్షా హీరో, హీరోయిన్లు సిద్ధార్థ్, కియారా అద్వానీ, ఒరిజనల్‌గా ఈ పాటను ఆలపించిన సింగర్ జుబిన్ నౌటియాల్ సైతం ఈ సాంగ్‌కు ముగ్ధులయ్యారు. నెటిజన్లు కూడా సంగీతానికి సరిహద్దుల్లేవని వీరిద్దరూ మరోసారి నిరూపించారంటూ కిలీపాల్- నీమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఈ సాంగ్‌లోని ప్రతి పదాన్ని ఎంతో ఫీల్ అవుతూ.. కరెక్ట్‌గా లిప్‌సింక్ ఇస్తూ తెగ ఎంజాయ్ చేశారు. కాగా టిక్‌టాక్ సెన్సేషన్‌గా కిలీపాల్‌కు ఆఫ్రికా ఖండంలో ఎంతో క్రేజ్ ఉంది. అతను చేసే టిక్‌టాక్ వీడియోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

