అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..బేస్ బాల్ స్టేడియం బయట ఫైర్..నలుగురికి గాయాలు
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ నగరంలోని నేషనల్ పార్కులో గల బేస్ బాల్ స్టేడియం బయట శనివారం సాయంత్రం ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. వేలమంది ప్రేక్షకులు పోటీలను చూస్తుండగా ఈ ఘటన జరిగిందని...
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ నగరంలోని నేషనల్ పార్కులో గల బేస్ బాల్ స్టేడియం బయట శనివారం సాయంత్రం ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. వేలమంది ప్రేక్షకులు పోటీలను చూస్తుండగా ఈ ఘటన జరిగిందని, దీంతో ప్రేక్షకుల్లో చాలామంది బయటకు పరుగులు తీశారని పోలీసులు ట్వీట్ చేశారు. దీంతో ఆట మధ్యలోనే నిలిపివేశారని కొందరు ఆటగాళ్లు కూడా బయటకు వచేశారన్నారు. మొదట కాల్పుల శబ్దం వినిపించిందని, గాయపడిన ఇద్దరు వ్యక్తులు భయంతో పరుగులు తీశారని, ఆ తరువాత కొద్దిసేపటికే మరో సారి కూడా ఫైర్ జరగగా మరో ఇద్దరు గాయపడ్డారని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. మొత్తానికి సుమారు డజను పేలుడు శబ్దాలు వినిపించినట్టు ఈ సంస్థ పేర్కొంది. అయితే ఎవరు..ఎందుకు కాల్పులు జరిపారో తెలియడం లేదని పోలీసులు వెల్లడించారు. సమాచారం తెలిసిన వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు.
గాయపడిన వారి పరిస్థితి విషమంగా లేదని, ఒక వ్యక్తికి కాలుపైన, మరో మహిళకు వీపు భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి తెలియడం లేదన్నారు, వాషింగ్టన్ నేషనల్ జట్టుకు, శాన్ డీగో పాడర్స్ జట్టుకు మధ్య బేస్ బాల్ పోటీ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అమెరికాలో గన్ కల్చర్ కి స్వస్తి చెప్పేందుకు అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలించడం లేదు. నిన్న ఆరేళ్ళ బాలికపై కాల్పులు జరిపి పరారైన వ్యక్తిని పట్టిఇస్తే భారీ రివార్డు ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఆ బాలిక మరణించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.
పెంపుడు కుక్కలకు ఆమె తొలి పరిచయం.. బిత్తరపోయిన మొహాలు చూసుకున్న శునకాలు వీడియో..:Pet Dog Video.