బాలకృష్ణ- బోయపాటి మూవీ.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్రను తీసేస్తున్నారా..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి

  • Tv9 Telugu
  • Publish Date - 1:13 pm, Mon, 23 November 20

Balayya Boyapati movie: నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ అవ్వడమే. అయితే ఈ మూవీ ప్రారంభించినప్పటి నుంచి ఏదొక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో మొదటి నుంచి బాలయ్యకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. (కోహ్లి సరైన నిర్ణయం తీసుకున్నాడు.. విరాట్‌కి రవిశాస్త్రి మద్దతు)

ఈ మూవీ కోసం ముందు మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్‌ని ఫైనల్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమె తప్పుకోగా.. ఆ తరువాత సాయేషా సైగల్‌ లైన్‌లోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం సాయేషా కూడా ఈ మూవీ నుంచి ఔట్ అవ్వగా.. ఆ స్థానంలో కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్యాల్‌ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. (‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’గా రష్మిక మందన్న.. స్పందించిన కన్నడ బ్యూటీ)

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరో వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే ఈ స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేశారట. ఈ క్రమంలో బాలయ్య అఘోరా తరహా పాత్రను తీసేస్తున్నారట. అంతేకాదు ఇందులో ఒక హీరోయిన్‌నే పెట్టనున్నారని, అలాగే పాటలను కూడా కట్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. (లెక్కల మాస్టార్‌కి కట్టలుతెంచుకున్న కోపం.. ‘పుష్ప’ టీమ్‌కి వార్నింగ్‌..!