అందం విషయంలో హాట్ టాఫిక్‌గా మారిన గోవా భామ.. వ్యతిరేకులందరికీ గట్టి కౌంటర్ ఇచ్చిన ఇలియానా..
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు కాస్త బొద్దుగా మారడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో 80 డేస్ పేరుతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మళ్లీ తన పాత రూపాన్ని సంతరించుకుంది.
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు కాస్త బొద్దుగా మారడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో 80 డేస్ పేరుతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మళ్లీ తన పాత రూపాన్ని సంతరించుకుంది. ఇప్పటికే ఆమె ఎవరో మీకు తెలిసి ఉండాలే! అదేనండీ ఆమె ఎవరో కాదు.. మన గోవా భామ ఇలియానా.. అయితే తనను బొద్దుగా ఉన్నావని ఎవరు అన్నారో తెలియదు కానీ అందం, శరీరం గురించి తన మనసులోన భావాలను వెల్లడించింది ఇలియానా.
మనుషులందరూ ఒకేలా ఉండలేరని, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుందని చెప్పుకొచ్చింది. తనలో ఉన్నలోపాల్ని సరిచేసుకుంటేనా చక్కటి వ్యక్తిత్వం ఏర్పడుతుందని చెప్పింది. అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంపై మొటిమలు, మచ్చలు సహజమేనని వాటిని సీరియస్‌గా తీసుకోవద్దన సూచించింది. నీలోని సహజ సిద్దమైన అందాన్ని అవి ప్రేరేపిస్తాయని తెలిపింది. మనుషులంటే అందంగా చెక్కిన శిల్పాలు కాదని, అందం, శరీర సౌష్టవం అందరికీ ఒకేలా ఉండవని పేర్కొంది. మనలోని లోపాల్ని మన్నించి సంతృప్తికర జీవితాన్ని గడిపినప్పడే అసలైన సంతోషం ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. మొత్తానికి తనను వ్యతిరేకించినవారికి మంచి కౌంటర్ ఇచ్చింది ఇలియానా.