Andhra: రెయిన్ అలెర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు
ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు కూల్ న్యూస్.. మరోవైపు పొలాల్లో లేదా కల్లాల్లో పంట ఉన్న రైతులకు అలెర్ట్. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏ జిల్లాలకు అలెర్ట్ ఇచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం...

రానున్న మూడు రోజులపాటు ఆంధ్రాలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం(15-04-25): శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం(16-04-25): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు,ప్రకాశం, నంద్యాల,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం (17-04-25): శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లి, కర్నూలు జిల్లా వగరూరులో 41.8°C, నంద్యాల జిల్లా ఆలమూరులో41.7°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1°C, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి 41°C, అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 47 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయిందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..