AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుండా ఆఫీస్‌కు వచ్చారు.. అది తెలిసి యాజమాన్యం ఏం చేసిందంటే..?

Unvaccinated: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే..

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుండా ఆఫీస్‌కు వచ్చారు.. అది తెలిసి యాజమాన్యం ఏం చేసిందంటే..?
Covid Vaccine
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2021 | 12:27 PM

Share

Unvaccinated: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. మృత్యు ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కూడా.. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది వేయించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. అలానే నిర్లక్ష్యంగా వ్యవహరించి ముగ్గురు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసుకు వ‌స్తున్న ముగ్గురు ఉద్యోగుల‌ను తొలగించినట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని సీఎన్ఎన్ చీఫ్ జెఫ్ జుక‌ర్ వెల్లడించారు. ఓ మెమో ద్వారా తోటి ఉద్యోగుల‌కు తెలియ‌జేస్తూ.. జాగ్రత్తగా ఉండాలంటూ హితవు పలికారు. ఆఫీసుకు రావాలంటే క‌చ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. ఫీల్డ్ రిపోర్టింగ్‌కు వెళ్లే వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకుని ఉండాల‌ని సూచించారు. బయటకు రిపోర్టింగ్‌కు వెళ్లేవారికి చాలామంది ట‌చ్‌లోకి వ‌స్తుంటార‌ని, దీంతో కరోనా బారిన పడే అవకాశం ఎక్కువని తెలిపారు.

వ్యాక్సిన్ వేసుకోని వారిని ఏ విధంగానూ స‌హించ‌బోమ‌ని.. తాము జీరో టొలెరన్స్‌ను అవలంభిస్తున్నామని జెఫ్ జుకర్ స్పష్టంచేశారు. ముగ్గురు ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్న జెఫ్.. ఆ ఉద్యోగులు ఎవ‌రు, వాళ్లు ఎక్కడ ప‌నిచేస్తారన్న విష‌యాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం న్యూస్ ఛాన‌ల్‌లో ప‌నిచేస్తున్న మూడ‌వ వంతు సిబ్బంది మాత్రమే ఆఫీసుకు వస్తున్నట్లు సంస్థ చెప్పింది. అయితే వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆఫీసుల్లోకి అనుమతిస్తున్నామని.. మాస్క్ ధరించడం తప్పనిసరని సీఎన్ఎన్ వెల్లడగించింది. ఇటీవ‌ల అమెరికాలో మ‌ళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. క‌చ్చితంగా ఆఫీసుకు రావాల‌న్న నిబంధ‌న‌ల‌ను అక్టోబ‌ర్ వ‌ర‌కు పొడిగించారు. దీంతోపాటు పలు చర్యలు తీసుకుంటున్న సీఎన్ఎన్ సంస్థ తెలిపింది.

Also Read:

Drinking Tea: భోజనం చేసిన వెంటనే టీ తాగుతున్నారా.? అయితే జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

Diabetes: మధుమేహం వ్యాధి అదుపులో ఉండటం లేదా..? జీలకర్రతో కంట్రోల్లో ఉంచుకోవచ్చు..!