Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేసిన ఈ దేశంలో కరోనా మళ్లీ తిరగబడుతోంది.. అన్ని రంగాలు మూసివేత

Corona Vaccine: వేసవిలో విదేశాలకు వెళ్లి, అక్కడ సేదతీరాలనే కోరిక ఉన్నప్పటికీ.. కోవిడ్‌ కారణంగా ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే పర్యటక ప్రాంతమైన తూర్పు ఆఫ్రికా దేశమైన....

Corona Vaccine: ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేసిన ఈ దేశంలో కరోనా మళ్లీ తిరగబడుతోంది.. అన్ని రంగాలు మూసివేత
Corona Vaccine
Follow us
Subhash Goud

|

Updated on: May 07, 2021 | 11:38 AM

Corona Vaccine: వేసవిలో విదేశాలకు వెళ్లి, అక్కడ సేదతీరాలనే కోరిక ఉన్నప్పటికీ.. కోవిడ్‌ కారణంగా ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే పర్యటక ప్రాంతమైన తూర్పు ఆఫ్రికా దేశమైన సీషెల్స్ లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే అక్కడ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడంలో ఆ దేశం ముందుంది. సీషెల్స్ అనేది భారతీయ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపసమూహం. కరోనా వైరస్ ప్రపంచంపై పంజా విసరడంతో చాలా దేశాలు లాక్‌డౌన్ బాట పట్టాయి. దీంతో ఆర్థికంగా కుదైలయ్యాయి. ఈ క్రమంలో క్రమంగా ఆంక్షలను ఎత్తేస్తూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో మహమ్మారి కారణంగా నష్టపోయిన చాలా దేశాలు.. పర్యాటక రంగం ద్వారా తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటలను స్వాగతం పలుకుతుండగా, మళ్లీ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమై అతలాకుతలం అవుతున్నాయి. ఇక విదేశీ టూరిస్ట్‌లకు వెల్‌కమ్ చెబుతున్న దేశాల జాబితాలో ముఖ్యంగా సీషెల్స్, థాయ్‌లాండ్, రొమానియా, జార్జియా, ఎస్టోనియా, గ్రీస్ దేశాలు మందు వరసలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో కూడా సీషెల్స్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో మళ్లీ ఆంక్షలు విధిస్తోంది సీషెల్స్. ఇతర దేశాల కంటే ఎక్కువగా వ్యాక్సిన్లు వేసిన సీషెల్స్‌.. ఇప్పుడు పాఠశాలలు, పార్కులు, పర్యటక ప్రదేశాలు, క్రీడా కార్యకలాపాలను రద్దు చేసింది. అలాగే బార్లను త్వరలో మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ దేశంలో ఉన్న జనాభాలో ఇప్పటి వరకు 60 శాతానికి పైగా టీకాలు వేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి పెగ్గి విడోట్‌ మీడియాకు వెల్లడించారు.

ఈ దేశం ఎక్కువ భాగం పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి చైనా వ్యాక్సిన్ల విరాళాల ద్వారా జనవరిలో టీకాలు వేయడం ప్రారంభించింది. ఏప్రిల్ 12 నాటికి మోతాదులో 59 శాతం సినోఫార్మ్‌ వ్యాక్సిన్లు, మిగితా కోవిషీల్డ్‌, ఆస్ట్రాజెనెకా టీకాలను వేసింది.

బ్లూమ్‌బెర్గ్‌ వ్యాక్సిన్‌ ప్రకారం.. ఇప్పటి వరకు ఆ దేశ జనాభాలో 62.2 శాతం మందికి కోవిడ్‌ టీకాలు వేశారు. ఈ దేశం తర్వాత ఎక్కువగా వేసిన దేశం ఇజ్రాయెల్‌. ఇక్కడ ఇప్పటి వరకు 55.9 శాతం టీకాలు వేశారు. ఇక్కడ కూడా కొత్త వేరియంట్ల వైరస్‌లను కనుగొన్నారు. గత ఏడాది చివర్లో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను ఫిబ్రవరిలో సీషెల్స్‌లో గుర్తించారు.

ఇవీ చదవండి:

Remdesivir Injection: కేంద్రం కీలక నిర్ణయం.. అతి తక్కువ ధరకే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌.. ఎలా పొందాలంటే..!

ఒత్తిడికి లోనైనప్పుడు కనిపించే లక్షణాలు.. ఒత్తిడిని జయించడం ఎలా..?: ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ కీలక సూచనలు