World Brain Day: దేశంలో పెరుగుతున్న మెదడు వ్యాధులు.. వీరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!

World Brain Day: ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్ మరియు బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న..

World Brain Day: దేశంలో పెరుగుతున్న మెదడు వ్యాధులు.. వీరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!
World Brain Day
Follow us

|

Updated on: Jul 21, 2022 | 10:03 PM

World Brain Day: ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్ మరియు బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవాన్ని జరుపుకుంటారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో, వెంటనే చికిత్స చేయాలి.

ఢిల్లీలోని ఆకాష్ హెల్త్‌కేర్ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మధుకర్ భరద్వాజ్ నాడీ వ్యవస్థ కమాండ్ సెంటర్ మెదడు అని, సంక్లిష్టమైన పని ద్వారా ఆలోచనలు, జ్ఞాపకశక్తి, కదలిక, భావోద్వేగాలు వచ్చేలా చేస్తుందని వివరించారు. శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి అయినప్పటికీ మెదడు ఆరోగ్యాన్ని భారతదేశంలో తేలికగా తీసుకుంటారు. న్యూరో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాని చికిత్సకు తగిన వనరులు కూడా లేవని అన్నారు. మెదడు రుగ్మతలతో పోరాడుతున్న ఏ వయసు వారికైనా సరైన వనరులు, సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని డాక్టర్ మధుకర్ చెప్పారు. దీని కోసం, మెదడుకు సంబంధించిన అన్ని వ్యాధుల గురించి సమాచారం ఉండాలని అన్నారు.

ప్రజల్లో కొనవడిన అవగాహన:

ఇవి కూడా చదవండి

జులై 22న ప్రపంచ బ్రెయిన్ డే లేదా వరల్డ్ బ్రెయిన్ డేను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటామని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ మిశ్రా తెలిపారు. ఈ రోజున, మెదడు రుగ్మతల భారాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అవగాహన కూడా పెరుగుతుంది. తద్వారా మెదడు వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. అయితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం శరీరంలో ఏదైనా మెదడు రుగ్మత లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు.

బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువ..

మెదడుకు సంబంధించిన అన్ని వ్యాధులూ ప్రమాదకరమని, అయితే ఇందులో బ్రెయిన్ ట్యూమర్ల కేసులు చాలా ఎక్కువగా ఉంటాయని న్యూరోసర్జన్ డాక్టర్ అమిత్ ఆచార్య వివరిస్తున్నారు. ఎవరికైనా ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఈ పరిస్థితిలో వైద్యులను సంప్రదించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి.

మీ మైండ్ ఫిట్‌గా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి:

☛ పోషకాలున్న ఆహారం తీసుకోండి

☛ రోజువారీ వ్యాయామం

☛ ఒత్తిడి తీసుకోకండి

☛ రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..