Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headache: మీ తల ఎడమవైపు ఎక్కువగా నొప్పి వస్తుందా ? అయితే నిర్లక్ష్యం అస్సలు చెయ్యోద్దు..

కానీ తలనొప్పితోపాటు.. దృష్టి సరిగ్గా లేకపోవడం.. వికారం వంటి లక్షణాలు ఉన్నవ్యక్తులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలనుంటున్నారు నిపుణులు.

Headache: మీ తల ఎడమవైపు ఎక్కువగా నొప్పి వస్తుందా ? అయితే నిర్లక్ష్యం అస్సలు చెయ్యోద్దు..
Headache
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 9:29 PM

ప్రస్తుతం చాలా మంది తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే కొందరికి తలనొప్పి తక్కువగా వస్తుంది. మరికొందరికీ మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ తలనొప్పితోపాటు.. దృష్టి సరిగ్గా లేకపోవడం.. వికారం వంటి లక్షణాలు ఉన్నవ్యక్తులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలనుంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తికి ఓకేవైపు తీవ్రమైన తలనొప్పి పలుమార్లు వేధిస్తుంటే వారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తలకు ఎడమవైపు నొప్పి ఉంటే అత్యవసర చికిత్స తప్పనిసరి అంటున్నారు నిపుణులు. తలనొప్పి ఎడమ వైపు రావడం.. దాని లక్షణాలు, చికిత్స ఏంటో తెలుసుకోండి.

తలనొప్పి రకాలు.. తలనొప్పి ఎడమవైపు వస్తుంది. అందులో మైగ్రెన్, క్లస్టర్ తలనొప్పులు ఉంటాయి. వీటిని వైద్యులు ప్రాథమిక, ద్వితీయంగా వర్గీకరిస్తారు. ప్రాథమిక తలనొప్పిలో మొదటి లక్షణం. ఇక సెకండరీ తలనొప్పి అనేది ఇతర కారణాల వల్ల వస్తుంది. అది బ్రెయిన్ ట్యూమర్, స్ట్రోక్, ఇన్ఫెక్షన్. ఇందులో ఎడమవైపులో తలలోని ఏ భాగానికైనా నొప్పి రావచ్చు.

మైగ్రేన్ తలనొప్పి.. తలకు ఎడమవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. దీనినే మైగ్రేన్ అంటారు. కొందరికి ఇది తక్కువగా ఉంటుంది. మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పి కళ్లకు, తల అంతటా వ్యాపిస్తుంది.

మైగ్రేన్ లక్షణాలు.. దృష్టిలో మార్పులు. (చూపులో) వికారం, వాంతులు. మైకము. ఫ్లాష్ లైట్ కు కాంతి సున్నితత్వం.

క్లస్టర్ తలనొప్పి.. ఇది తల నొప్పి తలకు ఒకవైపు లేదా కళ్ల చుట్టూ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. క్లస్టర్ తలనొప్పి ఉన్నప్పుడు తీవ్రమైన మంట కూడా ఉంటుంది. ఒకేవైపు పదే పదే నొప్పి వస్తుంది. ఇది దాదాపు 30 నుంచి 60 నిమిషాల వరకు ఉంటుంది.

క్లస్టర్ తలనొప్పి లక్షణాలు.. ముక్కు కారడం, మూసుకుపోవడం. కన్నీళ్లు రావడం. చెమటలు పట్టడం. ఒక కంటిలో నీరు రావడం. కన్ను ఎర్రగా కావడం.

సైకోజెనిక్. మెడకు గాయం కావడం వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది. సైకోజెనిక్ తలనొప్పి మెడలోని ఏదైనా భాగం నుంచి మొదలై తల వరకు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మెడ, తల, ముఖంలో ఒక వైపున వస్తుంది. సైకోజెనిక్ తలనొప్పి లక్షణాలు వేర్వేరు వ్యక్తులలో భిన్నంగా ఉంటాయి.

వాస్కులైటిస్.. ఇది రక్త నాళాలు, ధమనులు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. తలలో ఉండే రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. వాస్కులైటిస్ కారణంగా తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ తలనొప్పి 1 నిమిషం నుండి 5 నిమిషాల వరకు ఉంటుంది.

వాస్కులైటిస్ లక్షణాలు.. కంటిచూపు కోల్పోవడం తలలో ఒకవైపు నొప్పి నమిలేటప్పుడు నొప్పి. సరైన సమయానికి వాస్కులైటిస్‌కు చికిత్స చేయకపోతే కంటి చూపును శాశ్వతంగా కోల్పోవచ్చు.

తలలో నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు.. లేదా పదే పదే తలనొప్పి వస్తున్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కంటి చూపు సరిగ్గా లేకపోవడం.. జ్వరం, చెమట, వాంతులు, శరీరంలో ఒకవైపు బలహీనంగా ఉన్నప్పుడు వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.

అలాగే 50 ఏళ్ల తర్వాత తలనొప్పి సమస్య వస్తుంది. తీవ్రంగా తలనొప్పి వేధిస్తుంది. మానసిక పనితీరు, వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. తలనొప్పితో పనులు సరిగ్గా చేయలేరు. చాలామంది తలనొప్పి రావడంతోనే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ ఇలా ప్రతిసారి ఇలా చేయడం మంచిది కాదు.

తలనొప్పి రాకుండా ఉండాలంటే.. ఒత్తిడికి దూరంగా ఉండాలి. సరైన నిద్ర ఉండాలి.