Panipuri: పానీ పూరి లవర్స్‌కి గుడ్‌ న్యూస్.. అలాంటి వారు బరువు ఈజీగా తగ్గొచ్చట.. ఎలాగో తెలుసుకోండి..

బరువు తగ్గాలనుకునే పానీ పురి లాంటి ఆహారం తీసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. పానీపూరి, నీరు బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

Shaik Madar Saheb

|

Updated on: Jul 21, 2022 | 8:21 PM

Panipuri For Weight Loss: వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా ఉదర సమస్యలు, జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. అందువల్ల వర్షాకాలంలో బయట ఆహారం తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ పానీ పూరి లాంటివి అస్సలు తీనకూడదు. పానీ పూరి పుల్లటి నీటి వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే.. బరువు తగ్గాలనుకునే పానీ పురి లాంటి ఆహారం తీసుకోవచ్చని సూచిస్తున్నారు. పానీపూరి, నీరు బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

1 / 6
వాస్తవానికి పానిపూరి ఫుడ్ తినాలనుకున్న వారి కోరికను నియంత్రించడం చాలా కష్టం. స్నేహితులు నలుగురు కలిస్తే ఎక్కువగా పానీపూరి తింటారు. ఒక్కక్కరు 10 నుంచి 12 పానిపూరిలను లాగించేస్తారు.

2 / 6
అయితే పానీపూరి తినడం వల్ల బరువు తగ్గవచ్చన్న విషయం తెలుసా? బంగాళదుంపలు, చిక్‌పీస్, పలు కూరగాయాలు, కొత్తిమీర ఆకులు, చింతపండు లాంటి వాటిని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి ఉత్తమమైనవి. వీటిలో ఏదీ డీప్ ఫ్రైడ్ కాదు. శనగలు కూడా శరీరానికి మేలు చేస్తాయి.

3 / 6
పానీపూరిని సెమోలినా నుంచి తయారు చేస్తారు. పిండి భాగం చాలా తక్కువగా ఉంటుంది. అయితే.. బరువు తగ్గడానికి పానీపూరి తినాలనుకుంటే, బంగాళాదుంపను పూర్తిగా వదిలివేయండి. కేవలం బఠానీలు, కొత్తిమీర ఆకులు, నిమ్మరసంతో కూడా తినవచ్చు.

4 / 6
ఉప్పు శరీరానికి మంచిది కాదు. చాలామంది అదనపు ఉప్పుతో పానీపూరిని తింటారు. ముందుగా ఈ అలవాటు మానుకోవాలి. రుచికి కొద్దిగా ఉప్పు వాడండి.. పుల్లని నీటిలో కూడా ఎక్కువ ఉప్పు వేయకండి. ఇంకా ఎలాంటి అనవసరపు పదార్థాలు లేకుండా సాధారణంగా తినగలిగితే మంచిది.

5 / 6
బరువు తగ్గాలనుకుంటే.. సాయంత్రం వేళల్లో పానీపూరి తినాలి. ఆ తర్వాత నిద్రపోయే ముందు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. శరీరం నిర్విషీకరణ బాగా జరుగుతుంది. శరీరం బాగుంటుంది, అనేక శారీరక సమస్యలు కూడా తొలగిపోతాయి.

6 / 6
Follow us