AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birth Rate: ఒకరు కాదు ఇద్దరు కాదు అంత కంటే ఎక్కవ కనండి.. బంపర్ బహుమతులు గెలుచుకోండి.. ఆ దేశంలో ప్రోత్సాహాకాలు..

China offering benefits: ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక స్కీములను తీసుకొస్తోంది. పిల్లల జనాభా తగ్గుముఖం పట్టడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది అక్కడి నియంత ప్రభుత్వం.

Birth Rate: ఒకరు కాదు ఇద్దరు కాదు అంత కంటే ఎక్కవ కనండి.. బంపర్ బహుమతులు గెలుచుకోండి.. ఆ దేశంలో ప్రోత్సాహాకాలు..
China Birth Rate
Sanjay Kasula
|

Updated on: Aug 17, 2022 | 12:04 PM

Share

డ్రాగన్ కంట్రీ పక్క దేశాలను ఆక్రమించుకునే పనిలో ఉంటే.. ఆ దేశంలో రోజు రోజుకు జననాల రేటు పడిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువత కనిపించకుండా పోతున్నారు. యువత తగ్గి పోవడంతో శ్రామిక శక్తి నిర్వీర్యం అవుతోంది. దీంతో చైనా జి జిన్‌పింగ్ ప్రభుత్వం మంగళవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో స్థానిక భత్యాలను ఆదేశించింది. దేశంలో జనన రేటు రికార్డు స్థాయికి పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి దేశ జనాభా వేగంగా క్షీణించడం ప్రారంభిస్తుందని అక్కడి  అధికారులు తాజాగా హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం.. ఇప్పుడు అతి పెద్ద సంక్షోభంతో పోరాడుతోంది. ఎందుకంటే అక్కడ రిటైర్మెంట్ అవుతున్న కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యువ శ్రామికశక్తి లేకుండా పోతోంది.

2016లో రిజిడ్ పాలసీని కూడా రద్దు చేశారు

బీజింగ్ 2016లో తన కఠినమైన “ఒక బిడ్డ విధానాన్ని” ముగించింది. గత సంవత్సరం జంటలకు ముగ్గురు పిల్లలను కనేందకు అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న ఇంటికి ఒకరు అనే నినాదాన్ని ఎత్తిపడేశారు. అయినా అక్కడి జనాభా రేటు పెరగడం లేదు. గత ఐదేళ్లలో దేశంలో జననాల రేటు బాగా తగ్గింది. జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం జారీ చేసిన పాలసీ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా పునరుత్పత్తి దారుణంగా పడిపోయిందని వెల్లడించింది. ఆరోగ్యంపై ఖర్చును పెంచాలని.. దేశవ్యాప్తంగా పిల్లల సంరక్షణ సేవలను మెరుగుపరచాలని కేంద్ర,  ప్రాంతీయ ప్రభుత్వాలను కోరింది.

ఇవి కూడా చదవండి

రాయితీలు, పన్ను మినహాయింపులు, మెరుగైన ఆరోగ్య బీమా, అలాగే యువ కుటుంబాలకు విద్య, గృహాలు, ఉపాధి మద్దతుతో సహా “ప్రోయాక్టివ్ ఫెర్టిలిటీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కమిషన్ స్థానిక ప్రభుత్వాలకు కోరింది.