Tactical Bra: మహిళా జవాన్ల కోసం ప్రత్యేక ‘లోదుస్తులు’.. దీని వెనక పెద్ద కారణమే ఉందండోయ్‌..

Tactical Bra: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీల్లో అగ్ర రాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీతో అమెరికా...

Tactical Bra: మహిళా జవాన్ల కోసం ప్రత్యేక 'లోదుస్తులు'.. దీని వెనక పెద్ద కారణమే ఉందండోయ్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2022 | 12:20 PM

Tactical Bra: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీల్లో అగ్ర రాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీతో అమెరికా రక్షణ రంగ వ్యవస్థ అత్యంత బలంగా ఉంది. ఇక సైనికుల విషయంలోనూ అమెరికా చాలా కేర్‌ తీసుకుంటుంది. జీతభత్యాల విషయంలో కానీ, వారి రక్షణ విషయంలో చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా యూఎస్‌ ఆర్మీలో పనిచేసే మహిళల కోసం ప్రత్యేక లో దుస్తులు (బ్రా) రూపొందిస్తోంది. మహిళా జవాన్ల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని యూఎస్‌ ఆర్మీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

వీటిని రూపొందించే ముందు ఆర్మీలో సేవలందిస్తున్న మహిళా జవాన్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. మహిళా జవాన్లు యుద్ధ క్షేత్రంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే యుద్ధ సన్నాహాల్లో ఎదుర్కునే ఇబ్బందులకు చెక్‌ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై క్లాతింగ్ డిజైనర్‌, ఏటీబీ ప్రాజెక్ట్‌ లీడ్‌ మాట్లాడుతూ.. ‘ఈ జాకెట్‌ రూపకల్పన మహిళలకు కేవలం రక్షణ కల్పించడమే కాకుండా, అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మహిళా జవాన్లను సంసిద్ధత పరచడంతో పాటు, వారి పనితీరు స్థాయిలు మెరుగుపడతాయి. తద్వారా వారు వారి మిషన్‌పై దృష్టి పెట్టగలుగుతారు’ అని చెప్పుకొచ్చారు.

Army

ప్రస్తుతం నాలుగు రకాల బ్రా తయారీలను ఆర్మీ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. త్వరలోనే వీటిలో ఒకటి ఖరారు చేయనున్నారు. లో దుస్తువుల తయారీలో భాగంగా మహిళా జవాన్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. జవాన్ల లోదుస్తువులను ఆర్మీ అధికారులు రూపొందిస్తుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గత కొన్నేళ్లుగా మహిళా జవాన్ల నుంచి వస్తోన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తర్వాత యూఎస్‌ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా మహిళల ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తూ యూఎస్‌ ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..