Wife Shoots Husband: చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భర్త… కోపంతో కాల్పులు జరిపిన మహిళ

అతను పిల్లలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తూ...అందువల్లే తన భర్తను కాల్చినట్లు ఆమె చెప్పింది. వారు ఉన్న గదిలో పోలీసులకు దొరికిన ఒక డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది.

Wife Shoots Husband: చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భర్త...  కోపంతో కాల్పులు జరిపిన మహిళ
Wife Shoot Husband In Us
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2022 | 10:30 AM

Wife Shoots Husband: అమెరికాలోని (America) ఒక డే కేర్‌ సెంటర్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లో శాంతేరి వీమ్స్‌ డేకేర్‌ సెంటర్‌ నడుపుతోంది. అయితే పోలీస్‌ అధికారిగా పని చేసి రిటైరైన భర్త జేమ్స్ వీమ్స్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు శాంతేరీ గుర్తించింది. తన భర్త ముగ్గురు చిన్నారులపై దారుణైన అఘాయిత్యాలకు పాల్పడటంతో ఆమె సహించలేకపోయింది. దీంతో ఆమె ఈ విషయమై అతడిని నైరుతి వాషింగ్టన్‌లోని విలాసవంతమైన మాండరిన్ ఓరియంటల్ హోటల్‌లో గట్టిగా నిలదీసింది. కొద్దిసేపు వారి మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం చోటుచేసుకుంది. ఆ తర్వాత జేమ్స్ వీమ్స్  భార్య శాంతేరీ వీమ్స్ (50) గురువారం రాత్రి కాల్చినట్లు పోలీసులు తెలిపారు.  క్షత్రగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అంతేకాదు 13 లైంగిక నేరాలకు సంబంధించి  అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.  ప్రాణాపాయం లేదని వైద్య సిబ్బంది చెప్పారు.

ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే అతను పిల్లలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తూ…అందువల్లే తన భర్తను కాల్చినట్లు ఆమె చెప్పింది. వారు ఉన్న గదిలో పోలీసులకు దొరికిన ఒక డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ డైరీలో.. ఆమె భర్త ముగ్గురి పిల్లల జీవితాలను నాశనం చేశాడని, పలువురి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు రాసి ఉందన్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు ఒక వ్యక్తిని పక్షవాతం వచ్చే వరకు ఎలా కాల్చాలో కూడా వివరించి ఉందని చెప్పారు. అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఇప్పుడు ఆ మహిళ తాను నేరం చేశానని అంగీకరించటం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు అత్యంత సవాలుతో కూడిన మిస్టరీగా ఉంది. ప్రస్తుతం ఈ విషయమై యూఎస్‌ పోలీసులు జేమ్స్‌ వీమ్స్‌ను అరెస్ట్‌ చేసి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..