కోవిడ్ వ్యాక్సిన్లను అందజేయకుండా చూస్తున్నాయి, ధనిక దేశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫైర్
ధనిక దేశాలు కోవిడ్ వ్యాక్సిన్లను పేద దేశాలకు అందకుండా చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ మండిపడ్డారు. పైగా కరోనా వైరస్ టీకామందుల పంపిణీలో...
ధనిక దేశాలు కోవిడ్ వ్యాక్సిన్లను పేద దేశాలకు అందకుండా చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ మండిపడ్డారు. పైగా కరోనా వైరస్ టీకామందుల పంపిణీలో ఇవి దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయకుండా తమ స్వార్థాన్ని చూసుకుంటున్నాయని కూడా ఆయన ఆరోపించారు. కొన్ని ధనిక దేశాలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే కంపెనీలతో నేరుగా డీల్ కుదుర్చుకుంటున్నాయని, దీనివల్ల మా కోవాక్స్ కార్యక్రమం ద్వారా పేద దేశాలకు అందాల్సిన కేటాయింపులు తగ్గిపోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ దేశాలకు ఎక్కువ డోసులు కావాలంటే నిధులు అవసరం.. అమెరికా, యూరోపియన్ యూనియన్, జర్మనీ వీటికి ఆర్థికపరంగా తోడ్పడుతున్నప్పటికీ..వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు నిధులు ఉండి కూడా వృధా అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ఆయా కంపెనీలతో బడా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల మా కోవాక్స్ కార్యక్రమం నీరు గారిపోతోందని కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంపైనే పేద దేశాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని విస్మరించరాదన్నారు.
మీ దగ్గర నిధులు ఉంటే వాటిని వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి వ్యయం చేయవద్దు..డబ్బులు ఉన్నంత మాత్రాన అన్నీ ఉన్నట్టు కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు తమకు అవసరమైన వ్యాక్సిన్ల కన్నా ఎక్కువగా 1.25 బిలియన్ల డోసులను సేకరించాయని వన్ కాంపెయిన్ కో-ఫౌండర్, సింగర్ కూడా అయినా బోనో అన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
ఆస్ట్రేలియాలో మళ్ళీ ఫేస్ బుక్ హవా, న్యూస్ కంటెంట్ పునరుధ్దరణపై జోరుగా యత్నాలు, త్వరలో రాజీ
లీకుల రాయుడులా తమన్… సర్కారీ పాటల డేట్ ఇదే అంటూ.. థమన్ లీకులు
మహబూబాబాద్ ను వణికిస్తున్న దెయ్యం భయం.. వైరల్‌గా మారిన దెయ్యం వీడియో..!: Devil Video