ఇక ఓపెన్, క్రిమినల్ ప్రాసిక్యూటర్లకు ట్రంప్ టాక్స్ రికార్డులు, అమెరికా సుప్రీంకోర్టు అనుమతి

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ టాక్స్ రికార్డులను క్రిమినల్ ప్రాసిక్యూటర్లకు విడుదల చేసేందుకు యూఎస్ సుప్రీంకోర్టు అనుమతించింది. వీటిని సీక్రెట్ గా ఉంచాలని ట్రంప్ తరఫు లాయర్లు...

ఇక ఓపెన్, క్రిమినల్ ప్రాసిక్యూటర్లకు ట్రంప్ టాక్స్ రికార్డులు, అమెరికా సుప్రీంకోర్టు అనుమతి
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 23, 2021 | 12:00 PM

US Supreme Court:అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ టాక్స్ రికార్డులను క్రిమినల్ ప్రాసిక్యూటర్లకు విడుదల చేసేందుకు యూఎస్ సుప్రీంకోర్టు అనుమతించింది. వీటిని సీక్రెట్ గా ఉంచాలని ట్రంప్ తరఫు లాయర్లు చివరివరకు చేసిన యత్నాలను కోర్టు తిరస్కరించింది. తన ఆదాయపు  పన్నుకు సంబంధించిన రికార్డులను న్యూయార్క్ ప్రాసిక్యూటర్లకు అందజేయకుండా చూసేందుకు ట్రంప్ చాలాకాలంపాటు న్యాయ పోరాటం జరిపారు. మహిళలకు ఆయన  ఎన్నో చెల్లింపులు జరిపారని, మోసాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై ఈ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు జరపనున్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ఇక ఈ డాక్యుమెంట్లను మన్ హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సైరస్ వ్యాన్స్ కు అప్పగించడానికి మార్గం సుగమమైంది. మాజీ అధ్యక్షుని టాక్స్ రిటర్నులు పొందేందుకు డెమొక్రాట్ అయిన ఓ ప్రాసిక్యూటర్ ఎనిమిదేళ్లుగా  న్యాయ పోరాటం చేస్తున్నారు. 2011 నుంచి ట్రంప్ ఆదాయపు పన్ను డాక్యుమెంట్లను అందజేయాలని ఆయన తరఫు లాయర్లను సైరస్ ఆదేశించారు. గతంలోనే తాను ఈ మేరకు ఆదేశించానని, అది ఇప్పుడు కూడా కొనసాగినట్టు భావించాలని ఆయన అన్నారు.

2016 లో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇద్దరు మహిళలకు ట్రంప్ చేసిన చెల్లింపులపై ఈ అటార్నీ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. తమకు ఆయనతో ఎఫైర్ ఉందని ఈ మహిళలు గతంలోనే ప్రకటించారు. వీరిలో పోర్న్ స్టార్ స్టామీ డేనియల్స్ కూడా ఉంది. ట్రంప్ పన్ను ఎగగొట్టారని, బ్యాంకు ఫ్రాడ్ కు పాల్పడ్డారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదంతా రాజకీయ కక్షే అని ట్రంప్ బావురుమంటున్నారు.  టాక్స్ ఎగగొట్టారనే నింద నిరూపితమైతే ఆయనకు జైలు శిక్ష విధించవచ్చు.

నిజానికి అమెరికా అధ్యక్షులు తమ ఆదాయపు  పన్ను వివరాలు వెల్లడించవలసిన అవసరం లేదు. ప్రాసిక్యూషన్ నుంచి తనను మినహాయించాలన్న ట్రంప్ అభ్యర్థనను  గత జులైలో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మాజీ అధ్యక్షుడు 18 ఏళ్లకు గాను 11 ఏళ్ళల్లో పన్నులు చెల్లించని తాలూకు రికార్డులు తమవద్ద ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ లోగడ పేర్కొంది. 2016-17 లో ఆయన కేవలం 750 డాలర్లు మాత్రమే చెల్లించారని ఆ పత్రిక పేర్కొంది. కానీ ఈ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు.

Read More :

మరోసారి దయాగుణం చాటుకున్న భారత్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గగనతల ప్రయాణానికి అనుమతి..!

కోవిడ్ వ్యాక్సిన్లను అందజేయకుండా చూస్తున్నాయి, ధనిక దేశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫైర్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!