Al-Qaeda: జవహరి తర్వాత అల్‌ఖైదా కొత్త చీఫ్ ఎవరు..? తెరపైకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల పేర్లు..
రాజధాని కాబూల్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో అల్ జవహరి హతమైనట్లు FBI తన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అప్‌డేట్ చేసింది. 9/11 దాడుల బాధితులకు న్యాయం జరిగిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.

Al-Qaeda leader Ayman al-Zawahiri: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.. అల్‌ఖైదా చీఫ్ అమాన్ అల్-జవహరి హతమయ్యాడు.. డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు అమెరికా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని తన సురక్షిత నివాసంలో బాల్కనీలో రోజూ గంటల తరబడి కూర్చునే.. అల్ జవహరిని మృత్యువు వెతుక్కుంటూ వచ్చింది. హెల్‌ఫైర్ R9X అనే మిసైల్ చప్పుడు చేయకుండా పేలి- జవహరిని చంపేసినట్లు అమెరికా తెలిపింది. అల్ జవహరి చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కనిపించాయి. రాజధాని కాబూల్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో అల్ జవహరి హతమైనట్లు FBI తన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అప్‌డేట్ చేసింది. 9/11 దాడుల బాధితులకు న్యాయం జరిగిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఈ సందర్భంగా బైడెన్ గట్టి హెచ్చరికలు కూడా చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్‌కు హాని కలిగించే వారికి ధీటైన సమాధానం చెబుతాం.. వెతికి మరి మట్టుబెడతామని పేర్కొన్నారు. తాము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామమని.. ఎంత కాలం పట్టినా.. ఎక్కడ దాక్కున్నా.. వదిలిపెట్టమని జో బిడెన్ పేర్కొన్నారు. అయితే అమెరికా సీక్రెట్ ఆపరేషన్‌పై తాలిబన్లు స్పందించలేదు. ఈజిప్టులో జన్మించిన కంటి సర్జన్ అమాన్ అల్-జవహిరి.. ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు. 2011లో ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడిన్ మరణం తర్వాత అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ పగ్గాలను చేపట్టాడు. గతేడాది అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా చేసిన మొదటి డ్రోన్ స్ట్రైక్ ఇదే.
కాగా.. అల్ జవాహరిని హతమార్చిన తర్వాత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు ఎవరు నాయకత్వం వహిస్తారు అనే చర్చ మొదలైంది. జవాహరి తర్వాత సీనియారిటీ ప్రకారం.. సైఫ్ అల్-అడ్ల్, అబ్ద్ అల్-రెహ్మాన్ అల్-మఘ్రిబి, అబూ ఇఖ్లాస్ అల్ మస్రీ, అమీన్ ముహమ్మద్ ఉల్ హక్ సామ్, యాజిద్ మెబ్రాక్, అహ్మద్ దిరియే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్నారు. వీరిలో సైఫ్ అల్-అదేల్ చీఫ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జవహిరి లాగానే అదేల్ కూడా ఈజిప్టు పౌరుడు. ఈజిప్ట్ ఆర్మీలో పనిచేసి కల్నల్ స్థాయికి ఎదిగాడు.1993లో సోమాలియాలోని మొగదిషులో18 మంది US సైనికుల మరణానికి అల్ అదేల్ పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలో అదెల్‌ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా అమెరికాకి చెందిన FBI ఇప్పటికే ప్రకటించింది. అమెరికన్లకు చంపడానికి కుట్ర పన్నాడని, తమ దేశ ఆస్తులను ధ్వంసం చేయడానికి కుట్ర పన్నాడని FBI ఆరోపిస్తోంది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..