- Telugu News World What is rainbow eucalyptus IFS officer shares picture of colorful trees on twitter
Colorful Trees: ఇది పెయింటింగ్ అనుకుంటే పొరపాటే..ఇంద్రధనస్సు రంగులతో ఉన్న చెట్టు.. ఇవి ఎక్కడో తెలుసా?
Colorful Trees: సాధారణంగా చెట్లకు కలర్ అనేది ఉండదు. ఒకే రకంగా ఉంటాయి. లావుగా, సన్నగా ఉంటాయి తప్ప రకరకాల కార్లలో చెట్లు పెరుగుతాయి ఎవ్వరికి తెలియవు. కానీ ఇక్కడ పెరిగే చెట్లు ..
Updated on: Mar 18, 2022 | 1:29 PM

Colorful Trees: సాధారణంగా చెట్లకు కలర్ అనేది ఉండదు. ఒకే రకంగా ఉంటాయి. లావుగా, సన్నగా ఉంటాయి తప్ప రకరకాల కార్లలో చెట్లు పెరుగుతాయి ఎవ్వరికి తెలియవు. కానీ ఇక్కడ పెరిగే చెట్లు రకరకాల కాలర్స్‌తో ఉండటం వింతగా అనిపించవచ్చు. ఇటీవల IFS అధికారి సుశాంత్ నందా రెయిన్‌బో యూకలిప్టస్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చెట్టు ఇంద్రధనస్సు రంగులకు ప్రసిద్ధి చెందింది.

ఇది ప్రపంచంలోని అత్యంత రంగురంగుల చెట్లలో ఒకటిగా పరిగణించబడటానికి కారణం. ఇది ఒక ప్రత్యేకమైన చెట్టు. దీనిని సైన్స్ భాషలో యూకలిప్టస్ డెగ్లుప్టా అంటారు. దీనిని రెయిన్‌బో గమ్ అని కూడా అంటారు. ఈ చెట్టులో ఇన్ని రంగులు ఎందుకు కనిపిస్తున్నాయి.. ఏ దేశాల్లో ఉంటాయో తెలుసుకోండి.

ఈ ప్రత్యేక రంగు చెట్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కనిపిస్తాయి. వర్షారణ్యాలలో కనిపించే యూకలిప్టస్ జాతి ఇది ఒక్కటే. OneEarth నివేదిక ప్రకారం.. ఈ చెట్టు వయస్సు పెరిగేకొద్దీ దాని రంగు మారుతుంది. దాని రంగురంగుల రూపానికి ప్రత్యేక కారణం కూడా ఉంది.

నివేదిక ప్రకారం.. ఈ చెట్టు పెరిగి పెద్దదవుతున్న కొద్దీ దాని బెరడు తొలగిపోతుంది. బెరడు తొలగించబడిన తర్వాత కొత్తగా, ప్రకాశవంతమైన రంగులు కనిపించడం ప్రారంభమవుతుంది. చెట్టు మొత్తం మీద రంగు ప్రభావం కనిపించడానికి ఇదే కారణం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ప్రకృతి కళ అని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు.

రెయిన్‌బో యూకలిప్టస్ సగటు పొడవు 76 మీటర్లు. తక్కువ సంఖ్యలో ఈ చెట్టు హవాయి, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాలో కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ దాని పొడవు 30 నుండి 38 మీటర్ల వరకు ఉంటుంది.

ఈ చెట్టు వాణిజ్య స్థాయిలో చాలా విలువైనదిగా పరిగణించబడుతుంది. ఈ చెట్లతో కాగితం తయారు చేస్తారు. అయితే రంగురంగులుగా కనిపించినప్పటికీ పూర్తయిన కాగితంపై ప్రభావం చూపదు. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి.
