China Earthquake: చైనాలో భారీ భూకంపం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!
China Earthquake: చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్ యాన్ నగరంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా నలుగురు
China Earthquake: చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్ యాన్ నగరంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించగా.. 14 మంది గాయపడినట్లు చైనా అధికారులు ప్రకటించారు. చైనాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం(CENC) ప్రకారం సాయంత్రం 5 గంటలకు యాన్ నగరంలోని లుషాన్ కౌంటీలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 17 కిలోమీటర్ల లోతులో ఉందని CENC తెలిపింది. భూకంపం సంభవించిన మూడు నిమిషాల తర్వాత యాన్ నగరంలోని బాక్సింగ్ కౌంటీలో 4.5 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి నలుగురు వ్యక్తులు మరణించగా.. మరియు 14 మంది గాయపడ్డారని చైనా సర్కార్ ప్రకటించింది.
కాగా, చైనా భూకంపానికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం సంభవించిన తీరు, అక్కడి జనాలు భయంతో పరుగులు తీసిన విధానం అన్నీ ఆయా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూప్రకంపనలు భారీగా రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి, షాపింగ్ మాళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు. ఇక రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఇక పాఠశాలల నుంచి పిల్లలు బయటకు పరుగులు తీశఆరు.
2008లో టిబెటన్ పీఠభూమిలో ఉన్న ప్రావిన్స్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ప్రభావితమైన వారి కోసం నిర్మించిన ఇళ్లతో సహా భూకంపం, అనంతర ప్రకంపనలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దెబ్బతిన్న భవనాలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భూకంపం కారణంగా రెండు కౌంటీలలోని కొన్ని ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ దెబ్బతింది, అయితే అత్యవసర మరమ్మతుల తర్వాత కొన్ని ఆప్టికల్ కేబుల్స్ పునరుద్ధరించబడ్డాయి.
యాన్‌లో భూకంపం నేపథ్యంలో చైనా సర్కార్ అత్యంత వేగంగా స్పందించింది. నష్టాన్ని అంచనా వేస్తంది. ఎమర్జెన్సీ రెస్క్యూ, ఇతర విభాగాల నుండి 4,500 మందికి పైగా సిబ్బంది భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నారు.
Visual from CCTV footage of #earthquake 6.8 at #Sichuan #China 4 D!ed and 14 !njured #INDvSA #DeepakChahar #ENGvNZ #CbtfBestHai pic.twitter.com/xseXmOf8hE
— Alindasangma (@alindasangma) June 2, 2022
#Earthquake in China of magnitude 5.9 (6.1 Ms), Sichuan. (06/01/2022) pic.twitter.com/YPxYF3NHlF
— BRAVE SPIRIT (@Brave_spirit81) June 2, 2022