Ukraine War: యుద్ధం ముగిసేలా చూడండి.. G-7 నేతలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ అభ్యర్థన

G-7 on Ukraine: ఉక్రెయిన్‌కు 29.5 బిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి G-7 దేశాలు. రష్యా దాడులతో చితికిపోయిన ఈ దేశాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చాయి..

Ukraine War: యుద్ధం ముగిసేలా చూడండి.. G-7 నేతలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ అభ్యర్థన
Volodymyr Zelensky
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 28, 2022 | 6:52 AM

G-7 on Ukraine: జర్మనీలో సమావేశమైన G-7 (గ్రూప్ ఆఫ్ సెవన్) దేశాలు ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వర్చువల్‌గా ఈ సదస్సులో పాల్గొన్నారు. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి సహకరిస్తున్న G-7 దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా యుద్ధం అంతమయ్యేలా కృషి చేయాలని ఈ దేశాధినేతలను కోరారు జెలెన్‌స్కీ.. రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలనీ, అదే సమయంలో తమకు ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అందించాలని కోరారు. అనంతంరం ఎన్నిరోజులైనా సరే, ఇంకెంతకాలమైనాసరే ఉక్రెయిన్‌కు ఆదుకుంటామని G-7 దేశాలు భరోసా ఇచ్చాయి. ఆర్థికంగా, మానవతాపరంగా, మిలటరీ రూపంలో సాయం చేస్తామని ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఉక్రెయిన్‌కు సాయం అందించడం కోసం ఈ ఏడాది 29.5 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను G-7 దేశాలు ప్రకటించాయి.

మరోవైపు G-7 దేశాలు రష్యా ఆంక్షలు విధిస్తే, నాటో కూటమి మాత్రం భారీగా సైన్యాన్ని పెంచాలని నిర్ణయించింది. అవసరమై వెంటనే స్పందించేందుకు ఇప్పుడు 40వేల మంది సైనికులు నాటోకు అందుబాటులో ఉన్నారు. ఈ సంఖ్యను ఏకంగా మూడు లక్షలకి పెంచుతున్నట్లు నాసో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ప్రకటించారు. నాటో దేశాల భద్రతకు రష్యా పెనుముప్పుగా పరిణమించిందని నాటో చీఫ్‌ చెప్పారు.

ఇక ఉక్రెయిన్‌పై దాడులు మొదలుపెట్టిన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌- విదేశీ పర్యటనకు వెళుతున్నారు. సెంట్రల్‌ ఆసియా దేశాలైన తజకిస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌లలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!