G7 Summit: మనం కూడా చొక్కాలు విప్పదీసి దమ్ము చూపిద్దాం.. జీ7 సదస్సులో నేతల ఆసక్తికర వ్యాఖ్యలు..

జీ7 దేశాల సదస్సులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పలువురు నేతలు పుతిన్‌ను హేళన చేస్తూ మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొక్కా లేకుండా గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాన్ని చూసి ఎగతాళి చేశారు.

G7 Summit: మనం కూడా చొక్కాలు విప్పదీసి దమ్ము చూపిద్దాం.. జీ7 సదస్సులో నేతల ఆసక్తికర వ్యాఖ్యలు..
Vladimir Putin
Shaik Madarsaheb

|

Jun 27, 2022 | 11:54 AM

G7 leaders mock Putin: రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగు నెలలకుపైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది. జర్మనీలో జీ7 దేశాల సదస్సు జరుగుతున్న వేళ.. వ్లాదమిర్ పుతిన్ (Vladimir Putin) క్షిపణులతో దాడులు చేయాలని రష్యా సైన్యాన్ని ఆదేశించడం మరింత ఉత్కంఠకు దారి తీసింది. దీంతో రష్యా సైనికులు క్షిపణులతో ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకొనేందుకు దాడులు ముమ్మరం చేసిన రష్యా సేనలు.. రాజధాని కీవ్‌పైనా దృష్టి పెట్టాయి. ఆదివారం తెల్లవారుజామున కీవ్‌లో క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారని స్థానిక మేయర్‌ విటాలీ క్లిట్‌స్కో ప్రకటించారు. అయితే.. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు, మొండి వైఖరిపై చర్చించిన జీ7 నేతలు పుతిన్‌కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన ఏడు సంపన్న దేశాల గ్రూప్.. ఇంకా ఒంటరి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి.

అయితే.. జీ7 దేశాల సదస్సులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పలువురు నేతలు పుతిన్‌ను హేళన చేస్తూ మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొక్కా లేకుండా గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాన్ని చూసి ఎగతాళి చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. పుతిన్‌ను కామెంట్ చేస్తూ తమ రాబోయే ఫోటోషూట్ గురించి సరదాగా మాట్లాడుకున్నట్లు ది హిల్ నివేదించింది. కోట్లు, చొక్కాలు విప్పేసి మనమందరం పుతిన్ కంటే కఠినంగా ఉన్నామని చూపించాలి అంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కామెంట్‌ చేయగా.. చొక్కా లేకుండా గుర్రపుస్వారీ చేయాలి అంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో చమత్కరించారు. మన పెక్స్ కూడా చూపించాలి అంటూ జాన్సన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాగా.. గతంలో పుతిన్‌ చొక్కాలేకుండా చేపలు పట్టడం, గుర్రపు స్వారీ చేసిన ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. పుతిన్ చొక్కా లేకుండా అవుట్‌డోర్ యాక్టివిటీస్ చేయడం స్ట్రాంగ్‌మ్యాన్ ఇమేజ్‌లో భాగమని.. అతను నిష్ణాతుడైన టైక్వాండో అభ్యాసకుడని ది హిల్ నివేదించింది. జర్మనీ బవేరియన్ ఆల్ప్స్‌లో జరుగుతున్న మూడు రోజుల G7 సమ్మిట్ మొదటి రోజున పుతిన్ గురించి జోక్ చేసారని ది హిల్ పేర్కొంది. ప్రస్తుతం G7 దేశాలలో అమెరికా, కెనడా, గ్రేట్ బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu