Democracy: ప్రజాస్వామ్యంపై 110 దేశాలతో వర్చువల్ సమ్మిట్ నిర్వహించనున్న జో బిడెన్.. లిస్టులో చైనా పేరు లేదు..

ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పిలుపునిచ్చారు. డిసెంబరు 9-10 వరకు జరిగే ఈ సదస్సులో దాదాపు 110 దేశాలు పాల్గొననున్నాయి. కాగా, ఈ సమ్మిట్ కోసం చైనాను ఆహ్వానించలేదు.

Democracy: ప్రజాస్వామ్యంపై 110 దేశాలతో వర్చువల్ సమ్మిట్ నిర్వహించనున్న జో బిడెన్.. లిస్టులో చైనా పేరు లేదు..
Virtual Summit On Democracy

Democracy: ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పిలుపునిచ్చారు. డిసెంబరు 9-10 వరకు జరిగే ఈ సదస్సులో దాదాపు 110 దేశాలు పాల్గొననున్నాయి. కాగా, ఈ సమ్మిట్ కోసం చైనాను ఆహ్వానించలేదు. అయితే, తైవాన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. సమావేశంలో తైవాన్ పాల్గొనడం వల్ల అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది. ఆగస్ట్‌లో ఈ సమ్మిట్ ప్రకటన సందర్భంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా రక్షించడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అదేవిధంగా మానవ హక్కులను ప్రోత్సహించడం వంటి మూడు అంశాలపై సమావేశంలో చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది.

బిడెన్ విధానంపై ప్రశ్నలు

ఈ శిఖరాగ్ర సమావేశానికి బిడెన్ పాలనపై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికోసం పిలిచినా దేశాల విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యం క్షీణించిన బ్రెజిల్, ఫిలిప్పీన్స్, పోలాండ్ వంటి దేశాలు కూడా జాబితాలో ఉండడమే దీనికి కారణం. బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో నిరంకుశ ధోరణిని పలు దేశాలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ను కూడా చేర్చారు.

ఈ జాబితాలో నాటో సభ్య దేశం టర్కీ పేరు కూడా లేదు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన జాబితా ప్రకారం.. తుది జాబితాలో రష్యాను దూరంగా ఉంచగా, దక్షిణాసియా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు తప్పుకున్నాయి. మధ్యప్రాచ్య దేశాల నుండి ఇజ్రాయెల్, ఇరాక్ లను మాత్రమే చేర్చారు. యూఎస్ సంప్రదాయ అరబ్ మిత్రదేశాలు ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఖతార్, యూఏఈలను కూడా ఆహ్వానించలేదు.

జిన్‌పింగ్, బిడెన్ మధ్య సమావేశం..

అనేక సమస్యలపై కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య జో బిడెన్ జీ జిన్‌పింగ్‌తో ఇటీవల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. బిడెన్ జిన్‌పింగ్‌తో మాట్లాడుతూ – రెండు దేశాల మధ్య పోటీ ఉంది. అయితే, ఘర్షణను నివారించడానికి మేము గార్డ్‌రైల్ వంటి భద్రతా వ్యవస్థను నిర్మించాలని అన్నారు.

జిన్‌పింగ్ బిడెన్‌ను తన పాత స్నేహితుడిగా పిలిచారు. మేమిద్దరం కలిసి పని చేయాలి. ఏదైనా ఉద్రిక్తత లేదా సంఘర్షణను నివారించడానికి, కమ్యూనికేషన్, సహకారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: INS Vela: భారత నేవీలోకి నిశ్శబ్ద ఆయుధం ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి.. మెరుపుదాడితో శత్రువుల పని పట్టేస్తుంది!

OPPO EV: ఒప్పో నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కార్లు.. భారత్‌లో ఈవీలను తీసుకురానున్న మొబైల్ కంపెనీలు!

GDP: పరుగులు తీయనున్న భారత్ జీడీపీ.. ప్రపంచ స్థాయి సంస్థల అంచానా.. ఏ సంస్థ ఎంత అంచనా వేస్తోందంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu