America and China: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య డిజిటల్ సదస్సు..ఉద్రిక్తతలు తగ్గించేందుకే!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సోమవారం డిజిటల్‌ సదస్సును నిర్వహించనున్నారు. ఇందులో ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోటీని బాధ్యతాయుతంగా నిర్వహించే మార్గాలపై చర్చించనున్నారు.

America and China: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య డిజిటల్ సదస్సు..ఉద్రిక్తతలు తగ్గించేందుకే!
Us China Tensions
Follow us

|

Updated on: Nov 13, 2021 | 11:08 AM

America and China: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సోమవారం డిజిటల్‌ సదస్సును నిర్వహించనున్నారు. ఇందులో ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోటీని బాధ్యతాయుతంగా నిర్వహించే మార్గాలపై చర్చించనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ ఒక ప్రకటన చేసింది. బిడెన్, జిన్‌పింగ్‌ మధ్య సంవత్సరం చివరిలోపు డిజిటల్ సమావేశాన్ని నిర్వహించడానికి చైనాతో సాధ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యుఎస్ అధికారులు గత నెలలో తెలిపారు. రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత కొనసాగుతోంది.

“నవంబర్ 15, సోమవారం సాయంత్రం, అధ్యక్షుడు జో బిడెన్ వాషింగ్టన్ డీసీలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో డిజిటల్ సమావేశాన్ని నిర్వహిస్తారు” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. సెప్టెంబరు 9 నాటి ఫోన్ కాల్ తర్వాత అమెరికా, చైనాల మధ్య పోటీని బాధ్యతాయుతంగా నిర్వహించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చిస్తారని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆసక్తులపై కలిసి పనిచేసే మార్గాలను కూడా వారు చర్చిస్తారని అయన వివరించారు. “సమావేశంలో అధ్యక్షుడు బిడెన్ అమెరికా ఉద్దేశాలు.. ప్రాధాన్యతలను వివరిస్తారు. చైనాతో మా ఆందోళనలను స్పష్టంగా తెలియజేస్తారు. అని సాకి ఒక ప్రకటనలో తెలిపారు.

చైనాపై అమెరికా కఠిన వైఖరి..

గత కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అధ్యక్షుడు బిడెన్ ముందున్న డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యంలో చైనాపై కఠినమైన వైఖరిని తీసుకున్నారు. చైనా నుండి బిలియన్ డాలర్ల దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధించారు. దీనిపై బీజింగ్ కూడా ఇదే చర్య తీసుకుంది. బిడెన్ పరిపాలన ట్రంప్ కఠినమైన వైఖరిని కొనసాగించింది. మానవ హక్కులు, తైవాన్, జిన్‌జియాంగ్ అలాగే టిబెట్‌లతో సహా అనేక సమస్యలపై బీజింగ్‌పై సమిష్టిగా ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సాంప్రదాయ యూఎస్ మిత్రదేశాలతో కలిసి మరింత పని చేసింది.

వాతావరణ సహకారంపై రెండు దేశాలు ఒక్కటయ్యాయి

చైనా సైన్యం దూకుడు వైఖరి కనిపించే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కూడా బిడెన్ అమెరికా క్రియాశీలతను పెంచారు. అయితే, ఆశ్చర్యకరమైన చర్యగా, రెండు దేశాలు వాతావరణ సహకారాన్ని ప్రోత్సహిస్తాయని చైనా, యుఎస్ ఈ వారం ప్రకటించాయి. యూఎస్, చైనాలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకాలు. బుధవారం గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో రెండు ప్రపంచ ప్రత్యర్థుల నుంచి ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది.

సెప్టెంబరులో బిడెన్, జిన్‌పింగ్‌ 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు. ఇంతకు ముందు ఫిబ్రవరిలో ఇద్దరు నేతలు రెండు గంటలపాటు మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిడెన్‌కు జిన్‌పింగ్‌ కు మధ్య ఇది తొలి ఫోన్ కాల్.

ఇవి కూడా చదవండి: Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..

Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?

CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్‌!