AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌ వీడియో.. ఆర్థిక మంత్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టిన జనాలు.. ఎక్కడో తెలుసా?

సోషల్‌ మీడియా యాప్స్‌కు వ్యతిరేకంగా నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో అల్లకల్లోలం సృష్టించేలా చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన జనాలు ఏకంగా పార్లమెంట్‌నే తగలబెట్టారు. అంతేకాకుండా రాజకీయ నేతలపై కూడా దాడులకు పాల్పడ్డారు. ఇలానేదేశ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

షాకింగ్‌ వీడియో.. ఆర్థిక మంత్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టిన జనాలు.. ఎక్కడో తెలుసా?
Nepal Incident
Anand T
|

Updated on: Sep 10, 2025 | 2:13 PM

Share

నేపాల్‌లో రాజకీయ పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రభుత్వ నిర్ణయాణికి వ్యతిరేకంగా ప్రజల చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారి ఏకంగా ప్రజాప్రతినిధులనే దాడులు చేసేవరకు వెళ్లాయి. కొందరు ఏకంగా సీఎం, మంత్రుల నివాసాలపై దాడులు చేస్తుంటే.. మరి కొందరు వాళ్లు ఎక్కడ కనిపించినా అక్కడే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా దేశ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్‌పై కూడా నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులు ఆయన్ను వీధుల్లో వెంబడించి పరిగెత్తిస్తూ కొట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైరల్‌ వీడియో ప్రకారం.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా జనాలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ వారి కంటపడ్డాడు. ఇంకేముంది అందరూ కలిసి ఆయన్ను చుట్టుముట్టారు. దీంతో భయపడిపోయిన ఆయన వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారందూ అతని వెంబడిస్తూ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే మరి కొందరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి.. <

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.