Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: లక్ తలుపు తడితే ఇలాగే ఉంటుందేమో.. ఒకే లాటరీ టికెట్ పై రెండు సార్లు ఫ్రైజ్ మనీ.

ఒక నెంబర్ కు ఒకసారి లాటరీ తగిలితే.. లక్ కలిసి వచ్చిందంటూ సంతోష పడిపోతాం.. మరి అలాంటిది ఒకే నంబర్‌తో రెండుసార్లు లాటరీ తగిలితే.. ఆ టికెట్ యజమాని ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటువంటి ఆనందాన్ని అమెరికా మహిళ పొందుతోంది.

Viral News: లక్ తలుపు తడితే ఇలాగే ఉంటుందేమో.. ఒకే లాటరీ టికెట్ పై రెండు సార్లు ఫ్రైజ్ మనీ.
Lottery Tikcket In Us
Follow us
Surya Kala

|

Updated on: Jul 20, 2022 | 12:55 PM

Viral News: ఎప్పుడు, ఎవర్ని, ఎలా అదృష్టం వరిస్తుందో.. ఎవరూ చెప్పలేరు. లక్ కలిసి వస్తే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు.. తమ అదృష్టాన్ని లాటరీ టికెట్ ద్వారా పరిశీలించుకోవాలని భావిస్తూ  ఉంటారు. అయితే ఎవరి భవిష్యత్ ఎప్పుడు మారుతుందో ఏమీ చెప్పలేం.. లాటరీ టికెట్ ను లక్షలాది మంది కొంటారు.. కానీ కొంతమందిని మాత్రమే అదృష్టం వరిస్తుంది.. మరికొందరిని రిక్తహస్తాలతో ఉండిపోయేలా చేస్తుంది. కొందరు రాత్రికి రాత్రే ధనవంతులై.. చూపరులను సైతం ఉలిక్కిపడేలా చేస్తోంది. ఒక నెంబర్ కు ఒకసారి లాటరీ తగిలితే.. లక్ కలిసి వచ్చిందంటూ సంతోష పడిపోతాం.. మరి అలాంటిది ఒకే నంబర్‌తో రెండుసార్లు లాటరీ తగిలితే.. ఆ టికెట్ యజమాని ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటువంటి ఆనందాన్ని అమెరికా మహిళ పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని మేరీల్యాండ్‌లోని హయాట్స్‌విల్లే నగరంలో చోటు చేసుకుంది. మేరీల్యాండ్ లాటరీ రేస్ ట్రాక్స్ వర్చువల్ హార్స్ రేసింగ్ గేమ్‌లో ఒక మహిళ ఒకే గుర్రంపై రెండు పందెం వేసింది. అదృష్టం ఈ మహిళను ఓ రేంజ్ లో అతుక్కుంది. దీంతో రెండు పందాలను గెలుచుకుంది.

నివేదికల ప్రకారం, మహిళ $30,946  రెండు బహుమతులు గెలుచుకుంది. అంటే భారతీయ కరెన్సీలో మొత్తం 50 లక్షల రూపాయలు. టికెట్ల ఖరీదు.. ఇతర ఖర్చులు పోను.. ఆ మహిళకు 49.34 లక్షల రూపాయలు లాభం పొందింది. అయితే తనకు  10, 11, 12 పందాలు అంటే ఇష్టమైనవని ఆ మహిళ మేరీల్యాండ్ లాటరీ అధికారులకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రతి వారం లాటరీ తనకు లాటరీ ఆడే అలవాటు ఉందని ఆ మహిళ చెబుతోంది. వారానికి రెండుసార్లు లాటరీ కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ రోజు పందెం వేయడానికి సరైన సమయం అని ఒక రోజు తాను గ్రహించానని ఆ మహిళ చెప్పింది. దీంతో ఆ మహిళ నగరంలోని కెనిల్‌వర్త్ అవెన్యూ నుంచి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసింది. లాటరీ క్యాషియర్ వద్ద మొదట స్టాక్‌లో లేవు. కానీ తర్వాత క్యాషియర్ తనకు రెండు టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు సుమారు 31 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నట్లు హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే తనకు లాటరీ తగిలింది అని తెలియగానే  మొదట దిగ్భ్రాంతికి గురైనట్లు..  ఆ తర్వాత తన ఆనందానికి అవధులు లేవని పేర్కొంది. తనకు లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటానని సంతోషంగా చెబుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..