Barbaric Act: అమానుష ఘటన! 29 కుక్కలను తుపాకులతో విచక్షణారహితంగా కాల్చిన వైనం.. ఇది సురక్షిత దేశమా?

ఖతర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారిని కుక్క కరిచిందనే నేపంతో దాదాపు 29 వీధి శునకాలను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట..

Barbaric Act: అమానుష ఘటన! 29 కుక్కలను తుపాకులతో విచక్షణారహితంగా కాల్చిన వైనం.. ఇది సురక్షిత దేశమా?
Dogs
Follow us

|

Updated on: Jul 20, 2022 | 12:51 PM

horrifying incident at Qatar: ఖతర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారిని కుక్క కరిచిందనే నేపంతో దాదాపు 29 వీధి శునకాలను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. ఖతర్‌ దేశానికి చెందిన దోహాలో నివసిస్తున్న ఓ వ్యక్తి కుమారుడిపై కుక్క దాడి చేసి, గాయ పరిచింది. అనంతరం ఇతర కుక్కలన్నీ సమీపంలోనో ఓ ఫ్యాక్టరీలోకి ప్రవేశించాయి. ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో ఆ ఫ్యాక్టరీలోకి ప్రవేశించి, అక్కడి సెక్యూరిటీ గార్డును తమ వద్దనున్న ఆయుధాలతో బెదిరించి, లోపలికి ప్రవేశించి అక్కడనున్న కుక్కలను విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఈ ఘటనలో 29 వీధి కుక్కలు మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. నిజానికి అది శునక సంరక్షణ కేంద్రం. అక్కడ నివసించే కుక్కలు ఎవ్వరికీ హాని తలపెట్టవని, అవి చాలా స్నేహ పూర్వకంగా ఉంటాయని, అందరూ వాటిని ఇష్టపడతారని, అటువంటి కుక్కలను ఆయుధాలతో కాల్చి చంపడాన్ని నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గల్ఫ్‌ ప్రాంతమైన ఖతర్‌లో సామాన్య ప్రజలు ఆయుధాలు కలిగి ఉండటాన్ని తప్పు పడుతూ అక్కడి చట్టాలను దుయ్యబడుతున్నారు. ఇల్లలో తుపాకులను పెట్టుకుని వాడుతున్నారు? ఇది సురక్షత దేశమా ? అని పలువురు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఖతార్‌లో ఒక వ్యక్తి గన్‌ కలిగి ఉండాలంటే ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొంది ఉండాలి. అలాగే ఆ వ్యక్తికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అతనికి ఎటువంటి క్రమినల్ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండకూడడు. ఐతే ఎటువంటి లైసెన్స్‌ లేని తుపాకులున్న వారిని ఆ దేశ ప్రభుత్వం జరిమానాలు విధించడం లేదా ఏడాది నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష విధించడం వంటి చర్యలు చేపడుతుంది.