Viral Video: మనాటీ చేపపై ‘ట్రంప్’ పేరు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో.. ఫ్లోరిడాలో ఓ నదిలో..

అమెరికాలోని ఫ్లోరిడాలోగల ఓ నదిలో మనాటీ చేప పై ట్రంప్ పేరు చెక్కారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో

Viral Video: మనాటీ చేపపై 'ట్రంప్' పేరు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో.. ఫ్లోరిడాలో ఓ నదిలో..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 12:20 PM

అమెరికాలోని ఫ్లోరిడాలోగల ఓ నదిలో మనాటీ చేప పై ట్రంప్ పేరు చెక్కారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అంతరించిపోతున్న జంతువులపై వేధింపుల కేసుపై యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ దర్యాప్తు చేపట్టింది.

మొదటగా ఈ మనాటీ చేప ఫోటోలు మరియు వీడియోలను సిట్రస్ కౌంటీ క్రానికల్ అనే లోకల్ వార్తతపత్రిక ప్రచురించింది. దీంతో సోమవారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మనాటీ చేప వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తుండగా.. ఇవి చూసిన నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరిడాలోని గల్ఫ్ తీరంలో గల సిట్రస్ కౌంటీలోన హోమోసాసా నదిలో ఈ చేప ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఈ సమాజానికి ఇది సరైన పని కాదని అనుకుంటున్నాను అని సీనియర్ ఫెడరల్ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ క్రెయిగ్ కావన్నా ఓ వార్తపత్రికకు తెలిపారు. ఇక సిట్రల్ కౌంటీలో వన్యప్రాణులకు రక్షించడమే ముఖ్య ఉద్దేశ్యం. అందుకే దానిని నేచర్ కోస్ట్ అంటారని తెలిపారు.

ఆదివారం ట్రంప్ అని పేరున్న ఈ మనాటీ చేప నదిలో ఈతకొడుతుండగా.. అక్కడే ఉన్న బేసి అనే మహిళ వీటిని ఫోటో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చాలా దారుణం. దీనిని చూసి చాలా బాధవేసింది అని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ మనాటీ చేప వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగా.. దీనిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.