Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Vs China: గూఢచర్యంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు.. క్యూబాలో చైనా గూఢచర్య కార్యాలయాలంటూ ఆరోపణలు..

అమెరికాపై చైనా మరోసారి ఫోకస్ చేసింది. ఏకంగా గూఢచర్యానికి సాహసించింది. దీంతో గూఢచర్యంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

US Vs China: గూఢచర్యంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు.. క్యూబాలో చైనా గూఢచర్య కార్యాలయాలంటూ ఆరోపణలు..
Us Vs China
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2023 | 6:47 AM

ప్రతిదేశం తమ శత్రు, మిత్రదేశాల్లో పరిస్థితులను, రహస్యాలను తెలుసుకునేందుకు గూఢచారులను నియమించుకుంటాయి. మరికొన్ని దేశాలు సైబర్‌దాడుల ద్వారా ఆ రహస్యాలను తెలుసుకుంటుంటాయి. కానీ, డ్రాగన్‌ దేశం చైనా ఓ అడుగు ముందుకేసి, తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబాలో గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. దీంతో గూఢచర్యంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబాలో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు ఆరోపించారు. 2019లో క్యూబాలోని ఇంటెలిజెన్స్‌ సేకరణ వ్యవస్థలను చైనా అప్‌గ్రేడ్‌ చేసిందని… అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. ఇవి ఇంటెలిజెన్స్‌ రికార్డుల్లో పక్కాగా ఉన్నాయి వెల్లడించారు. మరోవైపు సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ను సేకరించే వ్యవస్థను చైనా నిర్మించేందుకు క్యూబా అంగీకరించింది. దీంతో ఆగ్నేయ అమెరికాలో సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ సేకరించేందుకు చైనాకు అవకాశం లభించింది.

అయితే దీనిపై అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి భిన్నంగా స్పందిస్తూ ఈ నివేదికలు పూర్తిగా కచ్చితమైనవి కావు. ఇవి కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే. ఇందులో పేర్కొన్న అంశాలు మా వద్ద ఉన్న సమాచారానికి సరిపోవడంలేదని తెలిపారు. ఇక చైనా ఇంటెలిజెన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా పత్రికలు ప్రచురించిన కథనాలపై క్యూబా, చైనా మండిపడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన చైనా క్యూబా అంతర్గత వ్యహారాల్లో అమెరికా జోక్యంపై హెచ్చరించింది. వదంతలు, అపవాదులను వ్యాప్తి చేయడం అమెరికా శైలి అని… ఇష్టానుసారంగా పరాయి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం దానికి పేటెంట్‌ అని వ్యాఖ్యానించింది. అయితే అమెరికాలో గూఢచర్యం చేస్తున్నట్టు చైనాపై ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చైనా అమెరికాలో గూఢచర్యం చేసేందుకు ప్రయత్నించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..