AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: హోటల్ లో బాలుడు చేసిన అల్లరి పని.. రూ. 946 కోట్ల నష్టం.. చిన్నారిపై 3.95 కోట్ల రూపాయల దావా ..

ఆపై నోటిలో తన వేలు పెట్టుకుని దానిని తీసి అక్కడున్న ఆహార పదార్థాలపై ఆ వేలును ఉంచాడు. బాలుడు రహస్యంగా చేసిన ఈ పనులన్నిటినీ మరో వ్యక్తి వీడియో తీశాడు. అంతే నిమిషాల వ్యవధిలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో రెస్టారెంట్ లో అమ్మకాలన్నీ పడిపోయాయి.

Viral News: హోటల్ లో బాలుడు చేసిన అల్లరి పని.. రూ. 946 కోట్ల నష్టం.. చిన్నారిపై 3.95 కోట్ల రూపాయల దావా ..
Sushi Chain In Japan
Surya Kala
|

Updated on: Jun 11, 2023 | 9:26 AM

Share

ఓ బాలుడు చేసిన అల్లరి పని.. రెస్టారెంట్‌కు 946 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అన్ని కోట్ల నష్టం రావడానికి అతడు ఏం చేశాడో తెలుసా? మొదట టేబుల్ పై ఉన్న సోయా సాస్ బాటిల్ మూత తెరిచి దానిని నాకిన బాలుడు, దాన్ని మళ్లీ అక్కడే పెట్టేశాడు. పోనీ అంతటితో ఆగాడా! అంటే అదీ లేదు. పక్కనున్న టీ కప్పులను చేతికి అందుకొని వాటిని నాలుకతో తాకుతూ లాలాజలం అంటించాడు. ఆపై నోటిలో తన వేలు పెట్టుకుని దానిని తీసి అక్కడున్న ఆహార పదార్థాలపై ఆ వేలును ఉంచాడు. బాలుడు రహస్యంగా చేసిన ఈ పనులన్నిటినీ మరో వ్యక్తి వీడియో తీశాడు.

అంతే నిమిషాల వ్యవధిలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో రెస్టారెంట్ లో అమ్మకాలన్నీ పడిపోయాయి. జపాన్‌లోని సుషీ రెస్టారెంట్‌కు చెందిన ఓ ఫ్రాంచైజ్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. సదరు బాలుడిపై రెస్టారెంట్ బ్రాంచ్ 3.95 కోట్ల రూపాయల దావా వేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడు చేసిన పనికి కంపెనీకి దాదాపు 946 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు సుషీ సంస్థ తన దావాలో పేర్కొంది. అయితే ఈ ఘటన పట్ల బాలుడు తన తప్పును ఒప్పుకున్నాడు. తనపై వేసిన దావాను కొట్టివేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. తాను, తన ఫ్రెండ్ కలిసి ప్రాంక్ వీడియో తీశామని బాలుడు కోర్టుకు తెలిపాడు.

అంతేకాదు తనపై ఉన్న ఫిర్యాదును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ విద్యార్థి న్యాయవాది మే నెలలో కోర్టుకు లేఖ పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ లేఖలో విద్యార్థి తాను చేసిన పనులను అంగీకరిస్తూ.. పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాడు. అయితే సుషీ చైన్‌లో కస్టమర్ల తగ్గుదలకు… స్టూడెంట్ చర్యలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని వాదించారు. హోటల్స్ లో ఏర్పడిన తీవ్రమైన పోటీ వలెనే నష్టం వచ్చినట్లు  సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..