AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ వరదలు: యూఎస్, యూకే, మలేషియా..35 దేశాల పౌరులు గల్లంతు!

నేపాల్ ఆకస్మిక వరద ముంచెత్తిన బీభత్సంలో గల్లంతైన విదేశీయుల్లో అమెరికా, బ్రిటన్, మలేషియా పౌరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం 90 మంది అమెరికా పౌరులతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే 56 మంది ఉక్రెయిన్ పౌరులు కనిపించకుండా పోయినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.

నేపాల్ వరదలు: యూఎస్, యూకే, మలేషియా..35 దేశాల పౌరులు గల్లంతు!
India, Us, Uk 35 Countries Citizens Missing After Nepal Floods
Sharada V
|

Updated on: Aug 28, 2026 | 1:51 PM

Share

నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో స్థానికులతో పాటు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు గల్లంతయ్యారు.  హిమాలయ ప్రాంతాన్ని కుదిపేసిన ఆకస్మిక వరదలు, భారీ కొండచరియలతో నేపాల్‌లో పరిస్థితి దారుణంగా మారింది. వరదల ధాటికి అనేక ప్రాంతాల్లో రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో గల్లంతైన వారి కుటుంబాలకు సమాచారం అందడం కష్టంగా మారింది.

వందల మంది మిస్సింగ్

నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన జల ప్రళయంలో నేపాల్ వైపు మృతి చెందిన 1,468 మందిలో కనీసం 517 మందిని విదేశీయులుగా గుర్తించారు. మరోవైపు టిబెట్ వైపు కనిపించకుండా పోయిన 558 మందిలో దాదాపు 260 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. అయితే గల్లంతైన వారి సంఖ్యపై వేర్వేరు సంస్థల గణాంకాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. సమాచార వ్యవస్థలు దెబ్బతినడం, ద్వంద్వ పౌరసత్వాల కారణంగా ఒకే వ్యక్తి వేర్వేరుగా లెక్కలోకి రావడం, మృతదేహాలను గుర్తించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఇందుకు కారణవుతున్నాయి.

35 దేశాల పౌరులు గల్లంతు

గల్లంతైన విదేశీయుల్లో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంది. దాదాపు 178 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. ఇప్పటి వరకు 11 మందిని  సురక్షితంగా రక్షించారు. గల్లంతైన భారతీయుల్లో 59 మంది కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారిలో ఉన్నారు.

అమెరికా, ఉక్రెయిన్, మలేషియా పౌరులు కూడా..

నేపాల్ ఆకస్మిక వరద బీభత్సంలో గల్లంతైన విదేశీయుల్లో అమెరికా, ఉక్రెయిన్, మలేషియా పౌరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం 90 మంది అమెరికా పౌరులతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే 56 మంది ఉక్రెయిన్ పౌరులతో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం 50 మందికి పైగా మలేషియా పౌరుల ఆచూకీ తెలియలేదని ప్రకటించారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య

ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 392 మంది మరణించినట్లు నిర్ధారణ కాగా.. 1,400 మందికి పైగా గల్లంతయ్యారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియాల్సి ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.  గల్లంతైన వారి కోసం నేపాల్ అధికారులు, భద్రతా బలగాలు, సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. గల్లంతైన వారిలో విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉండటంతో.. తమ పౌరుల పరిస్థితిపై ఆ దేశాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు గల్లంతైన వారి సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Follow Us
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు
అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్