Nepal Floods: 392కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య.. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాసువా జిల్లాలోని భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య 392కి చేరింది. హిమానీనదం విరిగిపడి రాళ్లు, మట్టి కొట్టుకురావడంతో పాటు భారత్-నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తర భారత్‌లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాసువా జిల్లాలోని భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య దాదాపు 400కి చేరింది. మంచుకొండలు విరిగిపడి మట్టి, రాళ్లు నదుల్లో చేరడంతో రెండు కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయి. అవి ఎప్పుడైనా తెగిపడే ప్రమాదం ఉండటంతో భారత్-నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తర భారత్‌లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు.. 84 మంది రెస్క్యూ
ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గురువారం రాత్రి వరకు నిర్వహించిన సహాయక చర్యల్లో త్రిశూలి-1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, తమిళనాడుకు చెందిన 21 మంది కైలాస మానససరోవర్ యాత్రికులతో కలిపి మొత్తం 84 మందిని సురక్షితంగా రక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రాల వారీగా నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలు
తమిళనాడు: కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో తమిళనాడుకు చెందిన 86 మంది యాత్రికులు ఉండగా అందులో పుదుచ్చేరికి చెందిన ముగ్గురు జాడ ఇంకా తెలియరాలేదు.దీంతో వారి ఆచూకీ కనిపెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం భారత విదేశాంగా శాఖ సహకారంతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఎప్పికప్పుడూ వారి పరిస్థితులను పర్యవేక్షిస్తుంది.
పశ్చిమ బెంగాల్: ఇక కోల్‌కతా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 32 మంది యాత్రికులు పచ్చిబెంగాల్ నుంచి మానససరోవర్ యాత్రకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. గైల్లంతైన వారిలో ముకుల్ రాయ్ కోడలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేశారు.
కేరళ, గుజరాత్: అటు కేరళ రాష్ట్రం నుంచి మానససరోవరకు యాత్రకు వెళ్లిన వారిలో 33 మంది ఆచూకీ తెలియరాలేదు. అలాగే గుజరాత్ నుంచి వెళ్లిన 17 మంది అదృశ్యమయ్యారనైట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని సురక్షితంగా తిగిరి తీసుకొచ్చేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఇక ఏపీ, తెలంగాణ: నుంచి దాదాపు దాదపు 20 మందికిపై ఈ యాత్రకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు ఆచూకీ లభించగా సరిహద్దుల్లో ఏడుగురు యాత్రికులు చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. వారిని భద్రతను RTGS ద్వారా మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్ర : బెంగళూరుతో సహా రాష్ట్రానికి చెందిన 13 మంది టిమ్యూర్, డార్చెన్ ప్రాంతాల్లో చిక్కుకుపోగా సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు వారిని క్షేమంగా ఇంటికి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అలాగే వరదల్లో చిక్కుకు పోయిన నాగ్‌పూర్‌కు చెందిన 106 మంది పర్యాటకులను ప్రత్యేక బస్సుల ద్వారా కాఠ్మాండు నుంచి బిహార్ సరిహద్దుకు సురక్షితంగా తరలించినట్టు అధికారులు తెలిపారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్: ఇక ఒడిశాకు చెందిన ఆస్ట్రేలియా ఎన్నారై దంపతులతో పాటు మరో యువతి ఈ యాత్రకు వెళ్లి గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు స్పస్టం చేశారు.
అమెరికా భరోసా
అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో డజన్ల కొద్దీ అమెరికన్లు కూడా ఉన్నారని, నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వరదల్లో సుమారు 90 మంది అమెరికన్లు గల్లంతయ్యారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లోని అమెరికా పౌరుల భద్రతను నిర్ధారించడమే ప్రభుత్వానికి తక్షణ ప్రాధాన్యత అని వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. కాఠ్మండులోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా పౌరులను గుర్తించి వారికి సహాయం చేయడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.
500,000 డాలర్ల ప్రకటన
వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు అత్యవసర ఆశ్రయం, సహాయ సామాగ్రి, నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత సహాయం అందించడానికి అమెరికా విదేశాంగ శాఖ, క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్‌తో కలిసి తన గ్లోబల్ అవార్డు ద్వారా 500,000 డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. సహాయక చర్యలకు మద్దతుగా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక విపత్తు ప్రతిస్పందన సలహాదారుని కూడా నియమించింది.
నేపాల్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ముప్పు
కృత్రిమ సరస్సులు గ్లేసియర్ విరిగిపడటంతో నేపాల్-చైనా సరిహద్దుల్లో భారీగా బురద, శిథిలాలు చేరి రెండు ‘బ్యారియర్ సరస్సులు’ ఏర్పడ్డాయి. ఈ సరస్సుల్లో నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగిపోతుండటంతో ఎప్పుడైనా గండిపడే (పేలిపోయే) ప్రమాదం ఉందని నేపాల్, చైనా అధికారులు సంయుక్తంగా అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రెస్క్యూ బృందాలు, ప్రయాణికులు వెంటనే నదీ తీరాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
