AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..?

Train Journey: రైలు ప్రయాణం అంటే సుఖవంతమైనది, ప్రశాంతమైనది అని భావించే ప్రయాణికులకు తరచూ తోటి వారి అనాలోచిత ప్రవర్తన వల్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది..

Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..?
Train Journey
Subhash Goud
|

Updated on: Aug 28, 2026 | 8:55 AM

Share

Train Journey: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ రైలులో కొందరి ఓవరాక్షన్‌ వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటాయి. ట్రైన్‌ జర్నీ అంటే సేఫ్‌గా ఉంటుందని భావిస్తున్నప్పటికీ కొందరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ట్రైన్‌లో ఓ తాగుబోతుల హంగమాకు ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. రైలు ప్రయాణం అంటే సుఖవంతమైనది, ప్రశాంతమైనది అని భావించే ప్రయాణికులకు తరచూ తోటి వారి అనాలోచిత ప్రవర్తన వల్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… ఆయన తన కుటుంబంతో కలిసి రైలు బోగీలో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది తోటి ప్రయాణికులు మద్యం సేవించడం ప్రారంభించారు. బహిరంగంగా మద్యం తాగుతూ రచ్చ చేయడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించడంతో తన కుటుంబానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. తాను కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నానని, మీ చర్యల వల్ల తాము తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని గట్టిగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ సదరు ప్రయాణికులు వినిపించుకోలేదు.

ఇవి కూడా చదవండి

లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినప్పటికీ రైల్వే అధికారుల నుంచి లేదా టికెట్ చెకింగ్ సిబ్బంది (TTE/RPF) నుంచి తక్షణ చర్యలు లేకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్లలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణాల్లో మద్యం సేవించడం తీవ్రమైన నేరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కఠిన చర్యలు తీసుకోవాలని, 139 లేదా ‘రైల్ మదద్’ (RailMadad) ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Personal Loan: పర్సనల్ లోన్ త్వరగా క్లోజ్ చేస్తున్నారా? తొందరపడి ఈ పొరపాటు అస్సలు చేయకండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us