రాఖీ ఎప్పుడు కట్టాలి? శుభ సమయం తెలుసా?
Samatha
28 August 2026
రక్షాబంధన్ పండుగ వచ్చేసింది. ఆగస్టు 28 శుక్ర వారం రోజున ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఇక రాఖీ పౌర్ణమి అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతముళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయి
తే ఈ పండుగ రోజు చాలా డౌట్స్ ఉంటాయి.
ముఖ్యంగా రాఖీ కట్టడానికి శుభ సమయం ఏది అనే చర్చ కొనసాగుతుంటుంది. భద్రకాలం ఉందా అని అనుమానపడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తె
లుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం ఈ సారి శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27, గురువారం ఉదయం 9 :8గంటలకు ప్రారంభమై, శుక్రవారం ఉదయం 9 :48 గంటలకు ముగుస్తుంది.
అందువలన ఆగస్టు 28 శుక్రవారం ఉదయమే రాఖీ కట్టడానికి చాలా శుభప్రదమైన రోజు అని చెబుతుంటారు పండితులు. ఈరోజు కట్టడం చాలా మంచిదంట.
ఆగస్టు 28న ఉదయం 5:57 గంటల నుంచి 9:40 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయంగా చెప్పుకొస్తుంటారు. అందువలన ఈ సమయంలో రాఖీ కట్టడం శు
భప్రదం..
అంతే కాకుండా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఎప్పుడైనా రాఖీ కట్ట వచ్చు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
నోట్ : పై సమాచారం నిపుణులు, పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమ
నించాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?