AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాను ఏమాత్రం తీసిపోదు.. 1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్ తెలిస్తే

అతనో నేరస్థుడు.. ఓ కేసులో అతనికి 1983లో కోర్టు జీవిత ఖైదు శిక్షను కూడా విధించింది. కానీ కొన్ని రోజు తర్వాత పెరేల్‌పై బయటకు వచ్చిన ఆ వ్యక్తి గడువు ముగిసినా తిరిగి జైలుకు వెళ్లలేదు.. దాదాపు 40 ఏళ్ల గడిచిపోయాయి. తాజాగా ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అదెంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సినిమాను ఏమాత్రం తీసిపోదు.. 1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్ తెలిస్తే
Life Convict Parole Violation
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 28, 2026 | 1:24 PM

Share

జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తి పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి ఏకంగా 40 ఏళ్లకు పైగా తిరిగి జైలుకు వెళ్లకుండా జీవించడం ఇప్పుడు న్యాయస్థానంలో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు.. తన గత నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయడం, చివరకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. జైలు నుంచి విడుదలైన ఖైదీలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారా? అనే ప్రశ్నను లేవనెత్తింది. పెరోల్ గడువు ముగిసిన తర్వాత జైలుకు తిరిగి రాని ఖైదీలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అవసరమని అభిప్రాయపడింది.

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన నందుల వీరన్నకు 1983లో ఓ హత్య కేసులో వరంగల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే అదే ఏడాది డిసెంబర్‌లో వీరన్న పెరోల్‌పై బయటకు వచ్చాడు. అతని పెరోల్ గడువు 1984 మార్చి 17తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఆ తర్వాత జైలుకు తిరిగి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. వీరన్న మాత్రం తిరిగి జైలు ముఖం చూడలేదు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు దశాబ్దాలకు పైగా అతను జైలుకు దూరంగా ఉన్నాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరన్న సాధారణ జీవితం గడిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తనపై ఉన్న జీవిత ఖైదు విషయం దాచిపెట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. 2004లో అతనికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా లభించింది. ఇంతకాలం అతని నేర చరిత్ర, పెరోల్ నిబంధనల ఉల్లంఘన అధికారుల దృష్టికి రాకపోవడం ఇప్పుడు తీవ్ర ప్రశ్నలకు తావిస్తోంది.

సుమారు 40 ఏళ్ల తర్వాత 2024 మే 16న పోలీసులు వీరన్న ఇంటికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం అతడిని జైలు అధికారుల ఎదుట హాజరుపరిచింది. వీరన్న భార్య చారమ్మ ఈ పరిణామాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను ఇన్నేళ్ల తర్వాత అరెస్టు చేయడం, అతని పెరోల్‌ను మరో మూడేళ్లపాటు నిరాకరించడం సమంజసం కాదని ఆమె తరఫు న్యాయవాదివాదించారు.

అయితే ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది మరో విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెరోల్ గడువు ముగిసిన తర్వాత వీరన్న జైలుకు తిరిగి రాకపోవడంతో వరంగల్ రూరల్, మహబూబాబాద్ పోలీసులకు జైలు అధికారులు పలుమార్లు లేఖలు పంపారని తెలిపారు. అతను ఇచ్చిన చివరి చిరునామాతో పాటు పరిసర గ్రామాల్లోనూ అతని కోసం గాలించినట్లు వివరించారు. చివరకు అతని ఆచూకీ లభించడంతో చట్టపరమైన చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత ఖైదు ఇంకా రద్దు కాలేదని, అయినప్పటికీ వీరన్న తన శిక్షను తప్పించుకుని జీవితంలో కీలకమైన సంవత్సరాలను జైలు బయట గడిపినట్లు కోర్టు పేర్కొంది. అతను ఉద్దేశపూర్వకంగానే జైలు శిక్షను తప్పించుకున్నట్లు కనిపిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందువల్ల అతను తనకు విధించిన మిగిలిన శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. పెరోల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మూడేళ్లపాటు పెరోల్ నిరాకరించాలని అధికారులు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది.

ఒక జీవిత ఖైదీ నాలుగు దశాబ్దాలకు పైగా జైలు బయటే ఉండటం, ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడం, అవార్డు అందుకోవడం వంటి పరిణామాలు జైళ్ల శాఖ, సంబంధిత అధికారుల పర్యవేక్షణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెరోల్‌పై బయటకు వెళ్లి గడువు ముగిసినా తిరిగి జైలుకు రాని ఖైదీలను వెంటనే గుర్తించేందుకు, వారిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు నొక్కి చెప్పింది.

ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి.. పెరోల్ పేరుతో బయటకు వచ్చి.. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు జైలు జీవితానికి దూరంగా ఉండటం, మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగడం.. ఇప్పుడు న్యాయవ్యవస్థలోనే కాకుండా జైళ్ల శాఖ పనితీరుపైనా తీవ్ర చర్చకు కారణమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల