Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ!
యెమెన్‌కు సంబంధించినదిగా వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా భద్రతా తనిఖీల సమయంలో పోలీసులు అనుమానాస్పద వస్తువులు, ఆయుధాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు. అయితే ఈ వీడియోలో మాత్రం భుజాలపై రైఫిళ్లు కనిపిస్తున్నప్పటికీ.. భద్రతా సిబ్బంది వాటిని పట్టించుకోకుండా వ్యక్తుల జేబులు, దుస్తులను తనిఖీ చేస్తున్నట్లు కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వైరల్ వీడియోలో ఓ చెక్‌పాయింట్ వద్ద పలువురు వ్యక్తులు వరుసలో నిలబడి ఉండగా.. భద్రతా సిబ్బంది ఒక్కొక్కరినీ తనిఖీ చేస్తున్నారు. వారిలో కొందరి భుజాలపై తుపాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చెకింగ్ సిబ్బంది ఆయుధాలపై కాకుండా వ్యక్తుల దుస్తులు, జేబులపైనే దృష్టి పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో “తుపాకులు కళ్లముందే కనిపిస్తున్నప్పుడు.. అసలు పోలీసులు దేని కోసం తనిఖీ చేస్తున్నారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలపై వివరణ కోరగా.. ఓ AI చాట్‌బాట్ ఇచ్చిన సమాధానంలో యెమెన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆయుధాలు, ముఖ్యంగా రైఫిళ్లు, సామాజిక-గిరిజన పరిస్థితుల కారణంగా సాధారణంగా కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా తనిఖీల ప్రాధాన్యతలు ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చని వివరించింది. అయితే వైరల్ వీడియోకు సంబంధించిన స్థలం, సమయం, సందర్భం స్వతంత్రంగా పూర్తిగా నిర్ధారించలేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వీడియో ఆధారంగా అక్కడి మొత్తం భద్రతా వ్యవస్థపై సాధారణీకరణ చేయడం సరికాదు.
ఇక వీడియోపై నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు పోలీసుల తనిఖీ విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి భుజాలపై రైఫిళ్లతో నిలబడి ఉన్న వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
🇾🇪 The security checkpoints in Yemen hit different
What the hell are they checking for?!?!
Definitely not weapons 😂
Writers: Sol, Ianpic.twitter.com/QymkS8wUX6
— Mario Nawfal (@MarioNawfal) August 26, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..