AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : మిత్రుడు జీవీ నారాయణరావు పార్ధివదేహానికి చిరంజీవి నివాళులు.. జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్..

సీనియర్ నటుడు జి.వి. నారాయణ రావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తన మిత్రుడి భౌతిక కాయానికి చిరు నివాళులు అర్పించారు. ఆయన పార్ధివదేహానికి పూలమా వేసి అంజలి ఘటించారు. అనంతరం జి.వి. నారాయణ రావుతో తనకు దశాబ్దాల పాటు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 1987లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో తన పరిచయం ఏర్పడిందని, అప్పట్లో నారాయణ రావు తెలుగు యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థిగా ఉంటూ ఇండస్ట్రీలో ఎలా మెలగాలో విలువైన సలహాలు ఇచ్చేవారని చిరంజీవి తెలిపారు.

Megastar Chiranjeevi : మిత్రుడు జీవీ నారాయణరావు పార్ధివదేహానికి చిరంజీవి నివాళులు.. జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్..
Chiranjeevi, Gv Narayana Ra
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2026 | 1:25 PM

Share

సీనియర్ నటుడు జి.వి. నారాయణ రావు మరణం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మెగాస్టార్ చిరంజీవి దివంగత నటుడితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. జీవీ నారాయణ పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జి.వి. నారాయణ రావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి తన ప్రసంగాన్ని 1987 నాటి జ్ఞాపకాలతో ప్రారంభించారు. అప్పుడు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న చిరంజీవికి, తెలుగు యూనివర్సిటీకి చెందిన సీనియర్ విద్యార్థి అయిన జి.వి. నారాయణ రావు పరిచయం అయ్యారు. నారాయణ రావు అప్పటికే పరిశ్రమలో సీనియర్‌గా వ్యవహరిస్తూ, సినీ రంగంలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి వంటి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఈ తొలి పరిచయమే వారిద్దరి మధ్య ఒక బలమైన అనుబంధానికి పునాది వేసింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ స్నేహం మరింత బలపడింది, ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం పెరిగింది. చిరంజీవి స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం చెక్కుచెదరలేదు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

జి.వి. నారాయణ రావు కేవలం ఒక నటుడిగానే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం కూడా విశేష కృషి చేశారని అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బాధ్యతలు స్వీకరించినప్పుడు, మా అసోసియేషన్ పేరుతో ఒక సొంత భవనం ఉండాలని నారాయణ రావు పట్టుబట్టారు. ఆయన కృషి, దార్శనికత వల్లే మా అసోసియేషన్‌కు సొంత భవనం సాధ్యమైందని చిరంజీవి తెలిపారు. ఒక సంస్థాగత అభివృద్ధికి ఆయన చూపిన అంకితభావం, దూరదృష్టి ఎందరికో ఆదర్శప్రాయమని చిరంజీవి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

కేవలం 10 రోజుల క్రితం, జి.వి. నారాయణ రావు చిరంజీవిని కలిశారు. తన తాజా చిత్రం గురించి వివరించారు. “మనం మంచి పనులు చేయాలి, స్ఫూర్తితో కొత్త కంటెంట్‌తో ఐదుగురు కుర్రవాళ్లు, పెద్దవాళ్లు ఎలా ఉంటారు” అనే వినూత్న కథాంశంతో తాను ఒక సినిమా తీశానని, ఈ సినిమాను తన స్నేహితులతో కలిసి నిర్మించానని నారాయణ రావు చిరంజీవికి వివరించారు. ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ సిద్ధంగా ఉందని, దానిని చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయాలని కోరారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని చిరంజీవిని కోరారు. చిరంజీవి సహకారం ఉంటే అందరికీ బాగుంటుందని, తనకు సంతోషంగా ఉంటుందని నారాయణ రావు ఆశించారు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

నారాయణ రావు చివరి కోరికను తలుచుకుంటూ చిరంజీవి కంటతడి పెట్టుకున్నారు. ఆ కోరిక తీరకుండానే, సినిమా విడుదలకు ముందే నారాయణ రావు మరణించడం అత్యంత విషాదకరమని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. “బహుశా ఇది తన ఆఖరి చిత్రం నా చేత కావొచ్చు” అని చిరంజీవి ఆవేదనగా అన్నారు. నారాయణ రావుకు చివరిసారిగా మద్దతుగా నిలవలేకపోయానని పరోక్షంగా తెలిపారు. జి.వి. నారాయణ రావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడిని, ఒక నిస్వార్థ సేవకుడిని కోల్పోయిందని చిరంజీవి అన్నారు. ఆయన జ్ఞాపకాలు, చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని మెగాస్టార్ నివాళులర్పించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

Follow Us