AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం..

ఇప్పటికే జల ప్రళయంతో వణికిపోతున్న నేపాల్ వాసులకు మరో ప్రకృతి విపత్తు ఎదరైంది. నేపాల్- చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. చైనాలోని సిచూవాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు భయంతొ బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.1గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.

చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం..
China Earthquake News
Anand T
|

Updated on: Aug 28, 2026 | 3:04 PM

Share

చైనా- నేపాల్ సరిహద్దులో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో గల లాంగ్‌చాంగ్ నగరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకారం, ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:13 గంటల ప్రాంతంలో ప్రావిన్స్‌లో సంభవించింది. ఈ భూకంప కేంద్రం 29.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 105.22 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద.. భూమికి 13 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు పేర్కొంది.

అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లోని భవనాలు పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణం నష్టం జరిగినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

అయితే ఈ భూకంపం సంభించిన ప్రాంతం నేపాల్ సరిహద్దులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జల ప్రలయంలో ఇబ్బంది పడుతున్న నేపాల్‌ వాసులను ఈ భూకంపం మరింత భయాందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బర్త్ అండ్, డెత్‌ సర్టిఫికెట్‌ జారీలో కీలక మార్పులు..
బర్త్ అండ్, డెత్‌ సర్టిఫికెట్‌ జారీలో కీలక మార్పులు..
తిరిగొచ్చిన చరణ్.. ఏకంగా త్రిగుణ్‏తోనే ఢీ.. చివరకు చేతులెత్తేశాడే
తిరిగొచ్చిన చరణ్.. ఏకంగా త్రిగుణ్‏తోనే ఢీ.. చివరకు చేతులెత్తేశాడే
NITకు పూర్వ విద్యార్థి రూ.కోటి విరాళం.. ఇప్పటికే రూ.25 లక్షలు జమ!
NITకు పూర్వ విద్యార్థి రూ.కోటి విరాళం.. ఇప్పటికే రూ.25 లక్షలు జమ!
ఆధార్, రేషన్ కార్డు ఉన్నాయా..? ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్..
ఆధార్, రేషన్ కార్డు ఉన్నాయా..? ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్..
ఐటీ హబ్‌లో అర్థరాత్రి కొండచిలువ హల్చల్.. యువకుడి ఏం చేశాడో చూడండి
ఐటీ హబ్‌లో అర్థరాత్రి కొండచిలువ హల్చల్.. యువకుడి ఏం చేశాడో చూడండి
ఎర్రవల్లి భూములపై సర్కార్ నజర్.. రికార్డుల వేటలో అధికారులు..
ఎర్రవల్లి భూములపై సర్కార్ నజర్.. రికార్డుల వేటలో అధికారులు..
భారత్, జపాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దయితే సెమీస్ చేరేదెవరు?
భారత్, జపాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దయితే సెమీస్ చేరేదెవరు?
యూట్యూబర్‌ వైష్ణవి భర్తను హత్య చేసింది నేనే.. సెల్ఫీ వీడియో కలకలం
యూట్యూబర్‌ వైష్ణవి భర్తను హత్య చేసింది నేనే.. సెల్ఫీ వీడియో కలకలం
ఛీ.. ఛీ మరీ ఇంత దారుణమా?.. మొబైల్ EMI కట్టలేదని..
ఛీ.. ఛీ మరీ ఇంత దారుణమా?.. మొబైల్ EMI కట్టలేదని..
యూపీఐ వాడుతున్నారా..? ఈ 7 లావాదేవీలు పూర్తిగా ఫ్రీ..
యూపీఐ వాడుతున్నారా..? ఈ 7 లావాదేవీలు పూర్తిగా ఫ్రీ..