ప్రధాని మోదీతో పాటు ‘క్వాడ్’ సభ్య దేశాలతో సమ్మిట్ నిర్వహించనున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

ప్రధాని మోదీతో పాటు 'క్వాడ్' సభ్య దేశాలతో సమ్మిట్ నిర్వహించనున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
Joe Biden

అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ భారత ప్రధాని మోదీతో బాటు క్వాడ్' సభ్యదేశాధినేతాల్తో ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన ఈ కూటమి (క్వాడ్) 2007 లో ఏర్పాటైంది.

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 07, 2021 | 11:32 AM

అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ భారత ప్రధాని మోదీతో బాటు క్వాడ్’ సభ్యదేశాధినేతాల్తో ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన ఈ కూటమి (క్వాడ్) 2007 లో ఏర్పాటైంది. ప్రధానంగా వ్యాక్సిన్ డిప్లొమసీ, ఇన్ ఫ్రాస్రక్చర్ తో బాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని తాజా పరిస్థితులపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారని ఈ ప్రాంతానికి సంబంధించి యూ-ఎస్ కో-ఆర్డినేటర్ అయిన కుర్ట్ క్యాంప్ బెల్ తెలిపారు. ఇక్కడ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చైనా చేస్తున్న యత్నాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రస్తావిస్తారని ఆయన చెప్పారు.ఇక వ్యాక్సిన్, వాతావరణ మార్పులు, (క్లైమేట్ చేంజ్), ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ఇందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై ప్రధాని మోదీ ఇందులో తమ సూచనలు తెలియజేయనున్నారు. ప్రధానంగా వ్యాక్సిన్ డిప్లొమసీ, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిణామాలు అజెండాగా ఉంటాయని క్యాంప్ బెల్ వెల్లడించారు. ఇక్కడ అంతర్జాతీయ చట్టాలను ప్రపంచ దేశాలు పాటించాలని జోబైడెన్ ఇదివరకే పిలుపునిచ్చారు.

ఈ ప్రాంతంలో క్రిటికల్ రూట్ల పరిరక్షణకు కొత్త వ్యూహాన్ని రూపొందించాల్సి ఉందని 2017 నవంబరులో క్వాడ్ సభ్య దేశాలు ఓ తీర్మానాన్ని రూపొందించిన విషయాన్ని జోబైడెన్ గుర్తు చేశారు. 2019 సెప్టెంబరులో న్యూయార్క్ లో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో దీనిని మినిస్టీరియల్ స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. ఇలా ఉండగా క్వాడ్ సమ్మిట్ లో ఇటీవలి కాలంలో పెరిగిన డ్రోన్ దాడుల విషయం కూడా ప్రస్తావనకు రావచ్చు. బాగ్దాద్ లో తమ ఎంబసీపై జరిగిన డ్రోన్ దాడిని అమెరికా లేవనెత్తవచ్చునని తెలుస్తోంది. అయితే ఆ డ్రోన్ ని అమెరికా భద్రతా దళాలు కూల్చివేశాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Handwara Encounter: హింద్వారాలో ఎన్‌కౌంటర్.. టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం

Anil kumble: ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్ క్రికెటర్ అనిల్‌కుంబ్లే… ( వీడియో )

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu