Handwara Encounter: హింద్వారాలో ఎన్‌కౌంటర్.. టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం

J-K's Handwara encounter: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగా నిరంతరం

Handwara Encounter: హింద్వారాలో ఎన్‌కౌంటర్.. టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం
Handwara encounter
Follow us

|

Updated on: Jul 07, 2021 | 11:03 AM

J-K’s Handwara encounter: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగా నిరంతరం ఆపరేషన్‌లు నిర్వహిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. తాజాగా భద్రతా బలగాలు మరో కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. జమ్మూకాశ్మీరులోని హింద్వారాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబేద్‌ హతమయ్యాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ ఎన్‌కౌంటర్ మరణించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసు ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.

ఈ ఎన్‌కౌంటర్ తమ పోలీసులకు అతిపెద్ద విజయమని ఐజీ విజయ్ కుమార్ అభివర్ణించారు. మెహ్రాజుద్దీన్‌కు పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలక నిందితుడని, ఉగ్రవాద సంస్థకు టాప్ కమాండర్ అని ఐజీ పేర్కొన్నారు. ఈ మేరకు కాశ్మీర్ జోన్ పోలీసులు కూడా ట్విట్ చేసి వెల్లడించారు. అయితే.. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Vastu Shastra : సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు దానం చేయొద్దు..! ఒకవేళ చేశారనుకో అంతే సంగతులు..?

Fuel Price Hike: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. మెట్రో నగరాల్లో రికార్డు స్థాయికి..