Vastu Shastra : సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు దానం చేయొద్దు..! ఒకవేళ చేశారనుకో అంతే సంగతులు..?
Vastu Shastra : హిందూ మతంలో ఏదైనా వస్తువు దానం చేయడం శుభసూచకంగా భావిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో మంచి జరుగుతుందని
Vastu Shastra : హిందూ మతంలో ఏదైనా వస్తువు దానం చేయడం శుభసూచకంగా భావిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో మంచి జరుగుతుందని నమ్మకం. కానీ వాస్తు ప్రకారం.. సూర్యాస్తమయం తరువాత కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది కాదు. సాయంత్రం పొరుగువారి నుంచి ఏదైనా తీసుకోవడం కూడా ఒక రకమైన అప్పులాంటిది. దీనివల్ల ఇంటికి మంచిది కాదు. అయితే సూర్యాస్తమయం తర్వాత ఏ వస్తువులు దానం చేయకూడదో ఒక్కసారి తెలుసుకుందాం.
1. పసుపు వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం పసుపు దానం చేస్తే ఇంట్లో మంచి జరగదు. పసుపు బృహస్పతి కారకంగా పరిగణిస్తారు. కనుక సాయంత్రం పసుపును దానం చేయకూడదు.
2. పాలు పాలు నేరుగా చంద్రుడికి సంబంధించినవి. ఇది లక్ష్మీ, విష్ణు దేవత కారకంగా నమ్ముతారు. అందువల్ల సూర్యాస్తమయం తరువాత పాలు దానం చేయడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది.
3. పెరుగు వాస్తు ప్రకారం పెరుగును శుక్రుని కారకంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని తెస్తుంది. సాయంత్రం పెరుగు దానం చేయడం ద్వారా ఇంటి ఆనందం పోతుందని నమ్ముతారు.
4. పాడైపోయిన ఆహారాన్ని దానం చేయడం మంచిది కాదు.. పేదవారికి ఆహారం దానం చేస్తే పుణ్యలోకాలు దక్కుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మంది పాడైపోయిన ఆహారాన్ని దానం చేస్తారు. అలా చేయడం పాపం. ఎల్లప్పుడూ శుభ్రమైన ఆహారాన్ని దానం చేయాలి.
5. డబ్బు, వ్యాపారం చేయవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు. ఇలా చేయడం ద్వారా తల్లి లక్ష్మి వెళ్లిపోతుందని నమ్మకం. దీంతో పాటు ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి. అందువల్ల సాయంత్రం సమయంలో రుణాలు తీసుకోవడం మానుకోవాలి.
6. గమనిక- ఈ సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి..