Fuel Price Hike: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. మెట్రో నగరాల్లో రికార్డు స్థాయికి..

Fuel Price Hike: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. మెట్రో నగరాల్లో రికార్డు స్థాయికి..
Fuel price

Petrol and Diesel Price Today: చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు

Shaik Madarsaheb

|

Jul 07, 2021 | 10:41 AM

Petrol and Diesel Price Today: చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర వంద మార్క్ దాటి పరుగులు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్‌పై 35, డీజిల్‌పై 17 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జూలైలో ఇప్పటివరకు ఇంధన ధరలు ఐదుసార్లు పెరిగాయి. 2021 మే 4వ తేదీ తర్వాత.. చమురు కంపెనీలు 37 సార్లు ఇంధన ధరలను పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.21కు చేరగా.. డీజిల్‌ రూ.89.53కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.106.25 కి పెరగగా.. డీజిల్‌ రూ.97.09 కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.100.23 ఉండగా.. డీజిల్‌ రూ.92.50 కి చేరింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.101.06 కి చేరగా.. డీజిల్‌ ధర రూ.94.06 కి పెరిగింది. బెంగళూరులో పెట్రోల్ రూ.103.56 కి పెరగగా.. డీజిల్ రూ.94.89 కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.104.14 కి పెరగగా.. డీజిల్‌ రూ.97.58 కి పెరిగింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 103.48, డీజిల్ ధర 97.12 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.105.88 కి పెరగగా.. రూ. 98.92 కి చేరింది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 104.81 ఉండగా.. డీజీల్ ధర రూ.97.90 కి పెరిగింది.

Also Read:

Revanth Reddy: ఇవాళ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ కాంగ్రెస్

Vastu Shastra : సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు దానం చేయొద్దు..! ఒకవేళ చేశారనుకో అంతే సంగతులు..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu