Covid Cases:మళ్లీ వణికిపోతున్న అమెరికా, విజృంభిస్తోన్న డెల్టా వేరియంట్
కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోయిన అమెరికా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. కరోనా నిబంధనలను పాటించడం వల్లనో, టీకాలు తీసుకోవడం వల్లనో తెలియదు కానీ కరోనా అయితే కాసింత కంట్రోల్‌లోకి వస్తోంది.. కాకపోతే కరోనా వైరస్ డెల్టా వేరియంట్ మాత్రం ఆధిపత్యం చూపుతోంది.
కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోయిన అమెరికా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. కరోనా నిబంధనలను పాటించడం వల్లనో, టీకాలు తీసుకోవడం వల్లనో తెలియదు కానీ కరోనా అయితే కాసింత కంట్రోల్‌లోకి వస్తోంది.. కాకపోతే కరోనా వైరస్ డెల్టా వేరియంట్ మాత్రం ఆధిపత్యం చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సగానికంటే ఎక్కువ కేసులు డెల్టా వేరియంట్‌వేనని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ అంటోంది.. కరోనా వేరియంట్లలో ఇదే చాలా ఫాస్టు. ఇట్టే వ్యాపిస్తంది. అందుకే చాలా వేగంగా అన్ని దేశాలకు వ్యాప్తించింది. అమెరికాలో చాలా ప్రాంతాలలో డెల్టా వేరియంట్ కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు 80 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమవుతోంది. కరోనా విజృంభించిన తొలి నాళ్లలో ఆల్ఫా వేరియంటే ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు ఆల్ఫా వేరియంట్ కేసులో కేవలం 28.7 శాతమే ఉన్నాయి. ఇంత వేగంగా విస్తరిస్తూ ప్రాణాలు తోడేస్తున్నా అమెరికాలో ఇంకా కొందరు టీకాలు తీయించుకోడానికి వెనుకాడుతున్నారు. తమకేమీ కాదన్న మొండి ధైర్యంతో ఉంటున్నారు.
డెల్టా వేరియంట్ వ్యాప్తి పెరుగుతుండటంతో వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని అమెరికా ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఫౌచీ అంటున్నారు. కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపిస్తుందని ఫౌచీ హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతోంది.. అయితే వీటి సంఖ్య తక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం. పైగా వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకినా ప్రాణగండం మాత్రం ఉండదు. అమెరికాలో 12 నంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో ఎక్కువ మంది టీకాలు తీసుకోలేదు. అయిదుగురిలో కేవలం ఒకరు మాత్రమే టీకా తీసుకున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో డెల్టా వేరియంట్ కారణంగా కేసులు పెరగడంపై అధికారులు ఆందోళన పడుతున్నారు. ఆసుపత్రుల్లో కిటకిట, అంబులెన్స్‌ల సైరన్ మోతలు వంటికి చూడకూడదు, వినకూడదు అనుకుంటే మాత్రం ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందేనని వైద్యులు అంటున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో ఉత్పరివర్తనంతో ఆవర్భవించిన డెల్టా వేరియంట్ డాక్టర్లను భయాందోళనకు గురి చేస్తోంది. ఆరోగ్యవంతులను కూడా నిస్సహాయస్థితిలోకి నెట్టేస్తోన్న ఈ వైరస్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది కరోనా వైరస్..రూపాలు మార్చుకుని మరీ దాడికి దిగుతోంది.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చెలరేగే అవకాశం ఉంది. ఆ మహమ్మారిని అడ్డుకునేందుకు అందరూ టీకాలు తీసుకోవడమే శరణ్యమని డాక్టర్లు హితవు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటికి చేస్తే కరోనాకు కాసింత కట్టడి చేయవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారిని డెల్టా వేరియంట్ అటాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న వ్యాక్సిన్లు కచ్చితంగా డెల్టా వేరియన్ నుంచి కాపాడగలవని, కాకపోతే వ్యాక్సిన్ తీసుకోవాలన్న సోయి జనాలలో లేకుండా పోతున్నదని ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : కేటీఆర్ మాటలకు సోను సూద్ ఫిదా..ప్రగతి భవన్ లో రియల్ హీరో తెలంగాణ మంత్రి ప్రశంసలు :Sonu Sood meet ktr Video.
మాట నిలుపుకున్న సోను సూద్..!నెల్లూరు వాసులు ఖుషి..ఆక్సిజన్ ప్లాంట్ పంపిన రియల్ హీరో:Sonu Sood video.