AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine: రష్యా – క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై మేమే దాడి చేశాం.. ఉక్రెయిన్ సంచలన ప్రకటన

గత ఏడాది మొదలైన రష్యా - ఉక్రెయిన్ యుద్దం ఇప్పటికీ ముగిసిపోలేదు. యుద్ధం మొదలైన కొన్ని నెలలకి రష్యా - క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై భారీ పేలుడు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ దాడి ఎవరూ చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.

Ukraine: రష్యా - క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై మేమే దాడి చేశాం.. ఉక్రెయిన్ సంచలన ప్రకటన
Crimea Bridge
Aravind B
|

Updated on: Jul 27, 2023 | 3:16 PM

Share

గత ఏడాది మొదలైన రష్యా – ఉక్రెయిన్ యుద్దం ఇప్పటికీ ముగిసిపోలేదు. యుద్ధం మొదలైన కొన్ని నెలలకి రష్యా – క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై భారీ పేలుడు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ దాడి ఎవరూ చేశారన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ ఆ వంతెనపై జరిగిన దాడిపై స్పందించింది. ఆ దాడి చేసింది మేమేనని అంగీకరించింది. ఉక్రెయిన్ నిఘా సంస్థ చీఫ్ వాసిల్ మాల్యుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాటలు ఆ దేశంలోని టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. మేం ఎన్నో ఆపరేషన్లు నిర్వహించామని.. అందులో విజయం సాధించిన తర్వాత వాటి వివరాలు బహిరంగంగా చెప్పగలమని అన్నారు. 2021లో అక్టోబర్ 8 న క్రిమియా వంతెనపై జరిగిన దాడి కూడా మా ఆపరేషన్లలో ఒకటి అని తెలిపారు.

గత ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 70 వ పుట్టినరోజు చేసుకున్న మరునాడే క్రిమియా వంతెనపై దాడి జరిగింది. ఈ బ్రిడ్జిపై వెళ్తున్న ట్రక్కులో బాంబు ఒక్కసారిగా పేలడంతో సమీపంలో ఉన్న రైలు వంతెనపై చమురు ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ దాడిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం కృషి చేస్తోన్న రష్యా.. 2014లోనే క్రిమియాను తన సొంతం చేసుకుంది. అనంతరం 2018లో 3 బిలియన్ డార్లు ఖర్చు చేసి.. రష్యా క్రిమియాను కలిపేలా రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. గత ఏడాది ఈ దాడి జరిగిన తర్వాత దీనికి తాము కారణం కాదని చెప్పిన ఉక్రెయన్.. ఇప్పుడు తామే చేశామని చెప్పడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!