Russia Ukraine War: యుద్ధంలో వెనకడుగే లేదు.. రష్యాకు ధీటుగా సమాధానం చెబుతామంటున్న జెలెన్‌స్కీ..
Russia-Ukraine conflict: ఎక్కడా తగ్గడం లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. రష్యాకు ధీటుగా సమాధానం చెబుతున్నామంటున్నారు. సైన్యంలో మనో ధైర్యం నింపుతున్నారు. లేటెస్ట్‌గా మరోసారి ఓ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా తీవ్రంగా..
ఎక్కడా తగ్గడం లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. రష్యాకు ధీటుగా సమాధానం చెబుతున్నామంటున్నారు. సైన్యంలో మనో ధైర్యం నింపుతున్నారు. లేటెస్ట్‌గా మరోసారి ఓ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా తీవ్రంగా నష్టపోతోంది. చెచెన్యా కంటే ఎక్కువ సైన్యాన్ని కోల్పోయింది. భారీ సంఖ్యలో రష్యన్ హెలికాఫ్టర్లను కూల్చేస్తున్నాం. అలాగే ఇప్పటికే 80 యుద్ధ విమానాలు వందలకొద్దీ ట్యాంకులను ధ్వంసం చేశామని ప్రకటించారు జెలెన్ స్కీ. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య 4వ విడత చర్చలు ఇవాల్టికి వాయిదా పడ్డాయి. ఇరు దేశాల అధికారుల మధ్య ఇవాళ కూడా చర్చలు జరగనున్నట్టు వెల్లడించారు.
ఇదిలావుంటే యుద్ధంలో గాయపడి మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన జెలెన్‌స్కీ గాయపడిన సైనికుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. యుద్ధంలో నేలకొరిగిన సైనికులను ఉక్రెయిన్ హీరోలుగా ఆయన అభివర్ణించారు. ఈ గౌరవం దక్కినవారిలో సీనియర్ లెఫ్టినెంట్ హట్సుల్ వోలోడిమిర్ ఒలెస్‌క్సాండ్రోవిచ్ ఒకరని వెల్లడించారు. అంతరం వారితో కలిసి సెల్ఫీ దిగారు.
అంతే కాదు.. ఆ వివరాలను ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. 25 యూనిట్ల రష్యన్ సైనిక సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు సుమారు 300 మంది శత్రు సైనికులను చంపినందుకు గౌరవార్థం ఉక్రెయిన్ హీరోగా గుర్తింపు దక్కింది. అటు, జెలెన్‌స్కీ సైనిక ఆస్పత్రిని సందర్శించి, అక్కడ సైనికులతో దిగిన సెల్ఫీలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
Президент України Володимир Зеленський відвідав у госпіталі поранених захисників України ??
? «Хлопці, швидше одужуйте. Вірю: найкращим подарунком до вашої виписки буде наша спільна перемога!» – зазначив @ZelenskyyUa pic.twitter.com/lHYZJHWvp8
— Defence of Ukraine (@DefenceU) March 13, 2022
ఇవి కూడా చదవండి: Wi-Fi Repeater: వైఫై రూటర్‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..