Ukraine Russian war: దారుణం! ఉక్రెయిన్ సైనికుడిని బతికున్న శవంలా మార్చిన రష్యన్లు.. మనసులను కలచివేస్తోన్న ఫొటో..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న నేపధ్యంలో ఎన్నో హృదయవిదారక దృశ్యాలు, మనసును మెలిపెట్టే సన్నివేశాలు నిత్యం వెలుగులోకొస్తున్నాయి. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉక్రెయిన్ వాసుల జీవనం ఎంత దుర్భరంగా ఉందో తెలిపే ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకొచ్చింది. దీంతో ప్రతి ఒక్కరూ రష్యన్లపై దుమ్మెత్తి పోస్తున్నారు..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న నేపధ్యంలో ఎన్నో హృదయవిదారక దృశ్యాలు, మనసును మెలిపెట్టే సన్నివేశాలు నిత్యం వెలుగులోకొస్తున్నాయి. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉక్రెయిన్ వాసుల జీవనం ఎంత దుర్భరంగా ఉందో తెలిపే ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకొచ్చింది. రష్యా చెర నుంచి బయటపడిన ఓ ఉక్రెయిన్ సైనికుడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తీవ్ర గాయాలపాలై, అనారోగ్యంతో కుంగిపోయినప్పటికీ, రష్యా నుంచి బతికిబయటపడిన అదృష్టవంతుడని పేర్కొంటూ.. మైఖైలో దియనోవ్ అనే సైనికుడి చిత్రాలను ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో షేర్ చేసింది. సదరు వ్యక్తి మునుపటి ఫొటోను, ప్రస్తుత ఫొటోలను కలిపి తన పోస్టులో షేర్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే మైఖైలో దియనోవ్ రష్యన్ బందిఖానా నుంచి బయటపడిన తర్వాత పుష్టిగా ఉన్న అతని రూపం, బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేకుండా తయారయ్యింది. రష్యా ఈ విధంగా జెనీవా ఒప్పందాలను కాలరాస్తోంది. ఈ విధంగా నాజీల వారసత్వాన్ని కొనసాగిస్తోందని రష్యాపై ఉక్రెయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునే క్రమంలో దియనోవ్ రష్యా సైనికులకు చిక్కాడు. కాగా, గత బుధవారం విడుదలైన 205 మంది సైనికుల్లో ఇతడు కూడా ఉన్నాడు. మీడియా కథనాల ప్రకారం.. మారియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ వర్క్‌లను రక్షించడానికి చేసిన పోరాటంలో దియానోవ్ రష్యన్లకు ఈ ఏడాది ప్రారంభంలో బందీగా దొరికాడు. ఐతే ఈ విధంగా బంధించిన వారిలో దాదాపు 205 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలను బుధవారం రష్యా విడుదల చేసింది. వీరిలో దియనోవ్ కూడా ఒకడు. దియనోవ్ తాజా చిత్రాల్లో.. అతను చాలా బలహీనంగా కనిపిస్తాడు. చేతులు, ముఖంపై గాయాల గుర్తులు ఉంటాయి. ప్రస్తుతం దయానోవ్ కైవ్ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
Ukrainian soldier Mykhailo Dianov is among the fortunate ones: in contrast with some of his fellow POWs, he survived russian captivity. This is how russia “adheres” to the Geneva Conventions. This is how russia continues the shameful legacy of Nazism. pic.twitter.com/cJpx7ZWQYo
— Defense of Ukraine (@DefenceU) September 23, 2022
అత్యంత బలహీనంగా ఉన్న అతనికి దీర్ఘకాలిక చికిత్స అవసరమని దయానోవ్ సోదరి అలోనా లావ్రుష్కో మీడియాకు తెలిపారు. రష్యన్ చెరలో అతను ఎదుర్కొన్న అమానవీయ పరిస్థితులకు నిదర్శనం ఏమంటే.. అతని బరువుతోపాటు ఎముకల పరిమాణం కొన్ని రెట్లు తగ్గిపోయిందని, అతని బరువు పెరిగితేకాని పూర్తిగా కోలుకోలేడని అతన్ని పరిశీలించిన వైద్యులు తెలిపారు.