తప్పతాగి మహిళ ఇంట్లోకి వెళ్లి నిద్ర పోయిన ప్రముఖ కంపెనీ సీఎఫ్‌వో..!
అతనో ప్రముఖ కంపెనీ సీఎఫ్‌వో.. తప్పతాగి మద్యం మత్తులో తన ఇంటికి బదులుగా ఓ మహిళ ఇంట్లోకి దూరాడు. అనంతరం బట్టలు విప్పేసి, ఎదురుగా ఉన్న మంచంపై గుర్రుపెట్టి నిద్రపోయాడు. కళ్లు తెరచి చూసే సరికి..
అతనో ప్రముఖ కంపెనీ సీఎఫ్‌వో.. తప్పతాగి మద్యం మత్తులో తన ఇంటికి బదులుగా ఓ మహిళ ఇంట్లోకి దూరాడు. అనంతరం బట్టలు విప్పేసి, ఎదురుగా ఉన్న మంచంపై గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఇంటి యజమాని ఆ సమయంలో ఇంట్లో లేదు. మర్నాడు ఉదయం తన ఇంట్లో నిద్రపోతున్న అగంతకుడిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు అయ్యాడు. ఇంతకీ ఎవరంటే..
అమెరికాకు చెందిన ప్రముఖ మీట్ ప్రాసెసింగ్ కంపెనీ అయిన టైసన్ ఫుడ్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) జాన్ ఆర్ టైసన్.. కంపెనీ ఫౌండర్ మనుమడైన టైసన్, కంపెనీ పగ్గాలు చేపట్టిన నాలుగో జనరేషన్‌గా పేరుగాంచాడు. ఐతే ఫూటుగా మద్యం సేవించిన టైసన్ ఓ మహిళ ఇంట్లో ప్రవేశించి, నిద్రపోయాడు. ఆదివారం (అక్టోబర్ 6) ఉదయం గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లో మంచంపై గుర్తించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన అర్కాన్సస్‌లో చోటుచేసుకుంది. దీంతో సదరు ఇంటికి చేరుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతన్ని టైసన్ ఫుడ్స్ సీఎఫ్‌ఓగా గుర్తించారు. టైసన్‌ను నిద్రలేపేందుకు ప్రయత్నించగా మత్తు నుంచి పూర్తిగా తేరుకోకపోవడంతో మేలుకోలేదు.
దీంతో మద్యం మత్తులో ఉన్నట్లు గమనించిన పోలీసులు వాషింగ్టన్ కౌంటీలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, 415 డాలర్ల బాండ్ తీసుకుని టైసన్‌ను విడచిపెట్టారు. కోర్టు ఎదుట డిసెంబర్ 1న హాజరుకావల్సిందిగా నోటీసులు సైతం జారీ చేశారు. ఐతే టైసన్ ఫుడ్స్ కంపెనీ మాత్రం ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.